- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ponguleti Srinivas Reddy : పార్టీలో తన స్థానంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏర్పడి ఏడాది కాలం గడిచిన సందర్భంగా ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏర్పడి ఏడాది కాలం గడిచిన సందర్భంగా ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) ఓ మీడియా ఛానెల్ నిర్వహించిన డిబేట్ లో పాల్గొన్నారు. ఈ డిబేట్ లో పొంగులేటి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తన స్థానం నంబర్ 2, 3 కాదని.. తన స్థానం 11 అని పేర్కొన్నారు. తన స్థానం ఏమిటనేది అవసరం లేదని, మంచి శాఖ దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా.. శక్తి వంచన లేకుండా కష్టపడతానన్నారు. ఎన్నికల్లో తాము హామీ ఇవ్వనివి కూడా అమలు చేస్తున్నామన్న మంత్రి.. తమకు రాజకీయాలు అవసరం లేదని, ప్రజలకు ఏది అవసరమో అది తప్పకుండా చేస్తామని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే ఆర్థిక సమస్యలు ఏర్పడ్డాయని, వాటి వల్లే అన్ని హామీలు వెంటనే అమలు చేయలేక పోతున్నామని.. తప్పకుండా అన్ని హామీలు నెరవేరుస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.






