పొంగులేటి రాజీనామా చేయాలి: BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్

by Kema Shiva Kumar |

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు.

పొంగులేటి రాజీనామా చేయాలి: BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి నాదర్‌గుల్ భూమి కాజేసే కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పొంగులేటి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిస్సహాయులైన మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఇతర ఎమ్మెల్యేలను పక్కన పెట్టుకొని తన బురదను ఇతరులకు అంటించే ప్రయత్నం చేశారన్నారు. పొంగులేటి ప్రెస్‌మీట్‌లో రెవెన్యూశాఖ మంత్రిగా కాకుండా రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సీఈఓగా మాట్లాడినట్లు ఉన్నదన్నారు.తెలంగాణ ప్రభుత్వాన్ని రాఘవ నడిపిస్తున్నారని స్పష్టమైందన్నారు.

పొంగులేటి తిమింగళంలా ఆస్తులను దోచుకుంటున్నారని.. ఆయనలా ఊర కుక్కల భాష తమకు రాదన్నారు. నాదర్‌గుల్ భూమిపై దమ్ముంటే ఆధారాలతో అమరుల స్థూపం దగ్గరికి రావాలని సవాల్ విసిరారు. బాలాపూర్‌లో 613 సర్వే నంబర్‌లో 374 ఎకరాలు ఉంటే.. అక్కడి ఫెన్సింగ్ మీద కోహినూర్ గ్రూప్, రాఘవ, మెఘా, శిల్పా, ఇన్‌పెక్స్, ఇన్ ఫ్రా అంటూ రోజుకో కంపెనీ పేర్లు ఉంటున్నాయని తెలిపారు. రాత్రికి రాత్రే బోర్డులు మారుతున్నాయన్నారు. కొత్వాల్‌గూడలో రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అని రాసి ఉంటే.. తాను, దాసోజు శ్రవణ్ నిజనిర్ధారణ కమిటీ వెళితే రాత్రికి రాత్రే తుడిపేసే ప్రయత్నం చేశారన్నారు. రెవెన్యూశాఖ మంత్రిగా ఉండి బోర్డులు తుడిపే పని చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. మే 21, 2025లో మైనింగ్ అండ్ జియాలజీ ఇచ్చిన నోటీసు రాఘవా కంపెనీకి కాదా అని నిలదీశారు.

Next Story