ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ సింగిల్ పేజీలోకి తీసుకొస్తున్నాం.. భూభారతిపై కీలక అప్ డేట్ ఇచ్చిన పొంగులేటి

by Muthe.Rajitha |

రాష్ట్రంలో భయంకరమైన ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్నామని, లోపభూయిష్టమైన చట్టాలను సవరిస్తామన్నామని.. అదే దిశగా భూ భారతిని తీసుకొచ్చామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి చెప్పారు.

ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ సింగిల్ పేజీలోకి తీసుకొస్తున్నాం.. భూభారతిపై కీలక అప్ డేట్ ఇచ్చిన పొంగులేటి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భయంకరమైన ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్నామని, లోపభూయిష్టమైన చట్టాలను సవరిస్తామన్నామని.. అదే దిశగా భూ భారతిని తీసుకొచ్చామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి చెప్పారు. దానికి అనుగుణంగానే కొత్త చట్టానికి నిబంధనలను స్పష్టంగా రూపొందించామన్నారు. కష్టమొస్త, అన్యాయం జరిగిందనుకుంటే కోర్టుకు వెళ్లకుండా భూ భారతి చట్టం ద్వారా ప్రజలకు ఉపయోగకరమైన చట్టాన్ని తీసుకొచ్చామని గుర్తు చేశారు. రెండేండ్ల రెవెన్యూ పాలనపై సచివాలయంలో మంత్రి పొంగులేటి వివరించారు. తన శాఖల్లో తీసుకొచ్చిన సంస్కరణలు, మార్పులను తెలిపారు. వాటి ద్వారా ప్రజలకు ఎంత మేలు కలిగిందన్న అంశాలను మీడియాకు వివరించారు. మెరుగైన రెవెన్యూ వ్యవస్థను దశల వారీగా అమలు చేస్తున్నామన్నారు. భూ భారతి చట్టం తర్వాత వచ్చిన 9 లక్షల అప్లికేషన్లను పరిష్కరించే దిశగా చట్టాన్ని అమలు చేస్తున్నామన్నారు. అలాగే ధరణి ద్వారా వచ్చి 2.45 లక్షల అప్లికేషన్లను పరిష్కరించాం. 10 నెలల్లో 4 నెలల్లో 2 లక్షలు వచ్చాయి. ఈ 6.45 లక్షల అప్లికేషన్లను పరిష్కరించాం. రిజెక్ట్ చేస్తే సరైన స్పీకింగ్ ఆర్డర్ ఇస్తూ సమాధానం ఇస్తున్నామన్నారు. సీసీఎల్ఏ లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతులతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అనేక అంశాలను మీడియాకు వివరించారు.

మూడింటి ఏకీకరణ

భూ భారతి చట్టం అమలైన తర్వాత వెబ్ సైట్ విదేశీ సంస్థ టెర్రాసిస్ కంపెనీ నుంచి కేంద్ర ప్రభుత్వ ఎన్ఐసీ సంస్థకు అప్పగించామని మంత్రి పొంగులేటి అన్నారు. ఈ క్రమంలోనే ల్యాండ్స్ అండ్ రికార్డుల వ్యవస్థతో పాటు దేశంలో ఉండే వివిధ రాష్ట్రాల్లో ఉండే మాదిరిగా సర్వే, రిజిస్ట్రేషన్ వ్యవస్థలను అనుసంధానం చేస్తున్నామన్నారు. కొత్త సంవత్సరంలో ఇది అమలు చేస్తామన్నారు. ధరణి యాప్ తయారు చేస్తే సీక్రెట్ లాకర్స్ ని ఓపెన్ చేసి అందరూ చూసే విధంగా పారదర్శకతను అమలు చేస్తున్నాం. ఎన్ఐసీ సంస్థ భూ భారతి చట్టాన్ని నడుపుతున్న ఎన్ఐసీకే ఈ కొత్త యాప్ ను తయారు చేసేటట్లుగా చేస్తున్నాం. అన్ని ఆప్షన్లతో ఎన్ఐసీ రూపొందించిన వెబ్ సైట్ ను వచ్చే నెల నుంచి అమలు చేస్తాం. ధరణి, భూ భారతిల మధ్య తేడా అందరికీ తెలుసునన్నారు. సర్వే మ్యాప్ లేకుండా గుంట భూమిని కూడా రికార్డుల్లో నమోదు చేయని వ్యవస్థను రూపొందించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.

త్వరలో భూధార్ నంబర్లు

దశాబ్దాల నుంచి పది 33 జిల్లాల్లో 413 గ్రామాలకు నక్షాలు లేవు. ఈ గ్రామాలకు పైలెట్ ప్రాజెక్టుగా నాలుగు ప్రాంతాల్లో ఐదు రెవెన్యూ గ్రామాల్లో నక్షాలతో పాటు సర్వే నంబర్లు ఇచ్చామన్నారు. 1948లో 40 లక్షల సర్వే నంబర్లు ఉండేవి. ఇప్పుడు 2.42 కోట్ల సర్వే నంబర్లుగా మారాయి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే ఐదు గ్రామాల్లో కొత్త సర్వే నంబర్లు ఇవ్వడంతో పాటు భూమికి హద్దులు నిర్ణయించాం. భూ ధార్ నంబర్ కూడా ఇస్తున్నామన్నారు. రెడీ చేశాం. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. విడతల వారీగా 413 గ్రామాల్లో మొదలు పెడతామన్నారు. 373 గ్రామీణ రెవెన్యూ గ్రామాల్లో ఫేజ్ 2 లో తీసుకోబోతున్నామన్నారు. సర్వే, బౌండరీస్, బై నంబర్లు, భూధార్ కార్డులు కూడా జారీ చేస్తామన్నారు. థర్డ్ ఫేజ్ లో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో చేపడతామన్నారు. మోడల్ ప్రాజెక్టుగా వివాదం లేని, అభద్రత లేని భూమి రికార్డులను రూపొందిస్తామన్నారు. వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. పదే పదే ఆ ప్రభుత్వాన్ని గుర్తు చేయడానికి నాకే సిగ్గనిపిస్తున్నది. కొత్త వ్యవస్థను నెలకొల్పేందుకు కొద్దిగా లేట్ అయినా చేస్తున్నామన్నారు. ఇచ్చిన ప్రతి మాటను అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో 10519 రెవెన్యూ గ్రామాల్లో మొదటి విడత ఆరు వేల మంది జీపీవో వ్యవస్థను రూపొందించామన్నారు. వారితో సర్వే, రికార్డులు, సరిహద్దుల వ్యవస్థను సక్రమంగా చేసేందుకు వీళ్లను ఉపయోగించుకుంటామన్నారు. భూధార్ యాప్ లో బ్యాంక్ అకౌంట్ మాదిరిగానే రికార్డులు ఉంటాయి. ఎన్ఐసీకి ఈ బాధ్యతలను అప్పగించినట్లు చెప్పారు. సర్వే మ్యాప్ కూడా ఫిక్స్ చేస్తున్నట్లు తెలిపారు. కో ఆర్డినేట్స్ కూడా భూధార్ లో పేర్కొంటున్నట్లు వివరించారు. భూధార్ కాన్సెప్ట్ ని పూర్తి సెక్యూరిటీతో చేస్తామన్నారు. డిసెంబరులోనే నక్షాలు లేని 373 గ్రామాల్లో సెకండ్ ఫేజ్ లో భూధార్ కార్డులు జారీ చేస్తామన్నారు.

లైసెన్సుడ్ సర్వేయర్ల వ్యవస్థ

లైసెన్సుడ్ సర్వేయర్లను కూడా పారదర్శకంగా అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. అప్లై చేసిన 10450 మందిలో క్వాలిఫై అయితే 3,490 మందిని నియామకపు పత్రాలు పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలో ఉండే ఒక్కో మండలానికి నాలుగు నుంచి ఆరుగురు ఉండే వరకు ఎంపిక చేస్తామన్నారు. 7 వేల మంది సెకండ్ ఫేజ్ వారికి 10వ తేదీ తర్వాత పరీక్ష పెడతామన్నారు. వారి నుంచి అర్హులకు కూడా లైసెన్స్ జారీ చేస్తామన్నారు. ఇది కూడా ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తామన్నారు. దాదాపు 2500 మందిని అలాట్ చేస్తామన్నారు. వారికి కావాల్సిన ఎక్విప్మెంట్ ని ఇస్తామన్నారు. టెక్నాలజీ ప్రకారం రోవర్స్ ని 400 కొనుగోలు చేశాం. పది రోజుల్లో వీటిని పంపిణీ చేస్తామన్నారు. సెకండ్ ఫేజ్ లోనూ మరికొన్ని కొనుగోలు చేస్తామన్నారు. సర్వే వ్యవస్థను దశల వారీగా రాష్ట్ర ప్రజలకు మంచి చేసేందుకు వినియోగిస్తామన్నారు. పారదర్శకంగా, క్వాలిటీతో, పద్ధతి ప్రకారం మేలు కలిగించే విధంగా చేస్తాం.

వ్యవస్థను కుప్పకూల్చారు

రెవెన్యూ వ్యవస్థను కుప్పకూల్చడం వల్లే తమకు ఆలస్యమవుతుందన్నారు. అందుకే పునర్నిర్మాణం చేస్తున్నామన్నారు. అనుకున్న దాని కంటే కాస్త ఆలస్యం అవుతుంది. కానీ పక్కాగా చేస్తామన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనేక సంస్కరణలు చేపట్టాం. ఇంకా చేయాల్సింది ఉందన్నారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేందుకు చర్యలు చేపడుతామన్నారు. స్లాట్ విధానాన్ని తీసుకొచ్చాం. దీని వల్ల కొనుగోలు, అమ్మకందార్లకు సౌకర్యవంతంగా ఉందన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఒకే చోట నిర్మించడం ద్వారా ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 59 ఆఫీసులను 12 స్థలాలకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. గచ్చిబౌలిలో మొదటి దశగా ఒకే చోట నిర్మించేందుకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా నిర్మాణాలను చేపట్టినట్లు తెలిపారు. సింగిల్ పేజీ మీదికి లేటెస్ట్ వెర్షన్, లేటెస్ట్ ఆప్షన్లతో తీసుకొస్తున్నాం. భూ భారతి అంటే ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ వంటి మూడింటి వివరాలను సింక్రనైజ్ చేస్తున్నామన్నారు. రానున్న కొద్ది రోజుల్లో ప్రజలకు మంచి చేసేందుకు తీసుకొస్తున్నామన్నారు.

త్వరలో సాదాబైనామాల రెగ్యులరైజేషన్

అగ్రికల్చర్ భూములను తహశీల్దార్, నాన్ అగ్రికల్చర్ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. వేర్వేరుగా ఉండడం వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి. అందుకే సింగిల్ పేజీకి తీసుకొస్తున్నాం. ఎక్కడా పొరపాటు జరగకుండా ఉండేందుకే సింక్రనైజ్ చేస్తామన్నారు. సాదాబైనామా అప్లికేషన్లు 9.25 లక్షలు ఉన్నాయి. భూ భారతిలో క్లియర్ చేస్తామని హామీ ఇచ్చాం. కోర్టు స్టే వెకెట్ చేయించాం. అప్లికేషన్లకు నోటీసులు జారీ చేశారన్నారు. త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. సొంత పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లిలో రెవెన్యూ ల్యాండ్ మైనింగ్ డిపార్టుమెంట్ ద్వారా ప్రభుత్వ భూమిని లీజుకు తీసుకున్నారు. కొందరు పెద్ద మనుషులు సాదాబైనామా ద్వారా కొనుగోలు చేశామంటున్నారు. అలాంటి వాటిని ఎలా చేస్తాం? ఫారెస్ట్, దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములను సాదాబైనామాల ద్వారా అప్లికేషన్లు పెట్టుకుంటే క్లియర్ చేయలేం. న్యాయమైన వాటిని మాత్రమే రెగ్యులరైజ్ చేయగలమన్నారు. ధరణి పెండింగ్ అప్లికేషన్లు, రెవెన్యూ సదస్సుల తర్వాత 9 లక్షల అప్లికేషన్లను జనవరి చివరికల్లా పూర్తి చేస్తామన్నారు. ఇంకా పెండింగులో ఉంటే ట్రిబ్యునల్ సిస్టంను ఏర్పాటు చేస్తామన్నారు.

త్వరలోనే అక్రమాలు వెల్లడిస్తాం

బీఆర్ఎస్ హయాంలో చోటు అంతులేని అవినీతి జరిగిందని, అందుకే ఫోరెన్సిక్ ఆడిట్ వేశామన్నారు. రెండు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా పూర్తయ్యింది. అక్రమాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. అలాగేజీవో 58, 59 అప్లికేషన్లను కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన స్థలాన్ని ఏదో కాగితం చూపించి తమదంటూ సహించమన్నారు. ఏదైనా ఉంటే నిజాలను నిర్ధారించడానికి ఎంక్వయిరీ తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. నిషేదిత జాబితాను పబ్లిక్ లో పెడతాం. అభ్యంతరాలు ఉంటే పరిశీలిస్తాం. పీవోబీలో అవకతవకలకు పాల్పడితే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 1/70 పరిధిలో నాన్ ట్రైబ్ వారికి కూడా రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈడీ, ఐటీ, కోర్టు కేసుల్లో ఉన్న భూములను నిషేదిత జాబితాలో నమోదు చేస్తామన్నారు. ఎక్కడా లీకులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

బాంబులు ఎవరి మీదనో చూద్దాం

బాంబులు రాసిన వాళ్ల మీద పడ్డాయా? నా మీద పడ్డాయా? నా కొడుకు మీద పడ్డాయా? అనేది త్వరలో తెలుస్తుందన్నారు. గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా పేజీలను నింపేందుకు రాసుకున్నవేనన్నారు. ప్రతి అంశం ప్రజలకు కనబడుతుందన్నారు. ఏదో పత్రికలో రాసినంత మాత్రాన అయ్యేది ఏం లేదన్నారు. జీవో 111 ల్యాండ్స్ లో హైకోర్టు ఆదేశాల మేరకు, చట్టాల ప్రకారమే నడుచుకుంటామన్నారు. జీహెచ్ఎంసీ విస్తరణ, 2047కి ఈ సిటీని డెవలప్మెంట్ చేయాలో ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రపంచంలోనే ఓ మోడల్ గా తీర్చిదిద్దేందుకే గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామన్నారు. ఎన్వోసీలు, ఆర్డీవోలు ఇచ్చిన పత్రాలు, కలెక్టర్లు ఇచ్చిన సర్క్యులర్లను చూపి ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే చూస్తే ఊరుకునేది లేదు. దొంగ పత్రాలను చూపిస్తే ఎన్వోసీలు ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. ల్యాండ్స్ అంశంలో తొందర పడలేమన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోకి ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలను విలీనం చేస్తున్న క్రమంలో మార్కెట్ ధరలను కరెక్షన్ చేస్తామన్నారు. హిల్ట్ ప్రాజెక్టుపై మాట్లాడేందుకు సిగ్గు ఉండాలని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ముడుపులు ఇచ్చిన వారికి గతంలో కన్వర్షన్ చేశారని, అవసరమైతే ఆ జీవోలను బయటపెడతామన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో పారిశ్రామిక భూములను కన్వర్షన్ చేసేందుకు ఏ పాలసీ లేకుండా పాలన చేశారు. ఆఖరికి ఆర్వోఆర్ చట్టానికే రూల్స్ జారీ చేయలేదని విమర్శించారు. జర్నలిస్టులకు త్వరలోనే అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తాం. మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాస్​రెడ్డితో సమీక్షలు నడుస్తున్నాయన్నారు. ఏ రాష్ట్రంలో ఇవ్వనన్ని 45 వేల అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రతిపాదన వచ్చిందని, త్వరలోనే పాజిటివ్ గా నిర్ణయం తీసుకుంటామన్నారు.

Next Story