Ponguleti: రైతుల చెప్పులరిగేలా చేశారు.. బీఆర్ఎస్‌పై పొంగులేటి ఫైర్

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-19 09:23:10  IST  )

బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) ‘ధరణి’ (Dharani)ని తీసుకొచ్చి రైతులను కష్టాల పాలు చేసిందని.. లేని భూ సమస్యలను సృష్టించి వారిని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతూ చెప్పులరిగేలా చేశారని రాష్ట్ర రెవెన్యూ, హోసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఆరోపించారు.

Ponguleti: రైతుల చెప్పులరిగేలా చేశారు.. బీఆర్ఎస్‌పై పొంగులేటి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) ‘ధరణి’ (Dharani)ని తీసుకొచ్చి రైతులను కష్టాల పాలు చేసిందని.. లేని భూ సమస్యలను సృష్టించి వారిని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతూ చెప్పులరిగేలా చేశారని రాష్ట్ర రెవెన్యూ, హోసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఆరోపించారు. ఇవాళ నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా కేంద్రంలో జరిగిన రైతు అవగాహన సదస్సు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి (Dharani)తో చాలామంది అన్నదాతలు ఇబ్బందులు పడ్డారని, ఆత్మహత్యలకు కూడా వెనుకాడలేదని అన్నారు. గతంతో ‘రైతుబంధు’ (Raithu Bandhu) బీఆర్ఎస్ (BRS) తొత్తులకు మాత్రమే ఇచ్చే వారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ సర్కార్ (BRS Government) తీసుకున్న నిరంకుశ నిర్ణయం వల్ల సామాన్యులు కూడా ఇబ్బందుల పడ్డారని అన్నారు. కేసీఆర్ (KCR) ప్రభుత్వ పెద్దల కుటుంబాలకు మాత్రమే ఉపయోగపడేలా ‘ధరణి’ చట్టం తెచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ (BRS) నేతల మాటలను వినట్లేదనే గత సర్కార్ వీఆర్ఏ (VRA) వ్యవస్థను లేకుండా చేసిందని ఫైర్ అయ్యారు. రైతుల భూసమస్యలను సమూలంగా పరిష్కరించేందుకే తాము ‘భూభారతి’ (Bhu Bharati) చట్టాన్ని తీసుకొచ్చామని అన్నారు. గ్రామలాల్లో రెవెన్యూ అధికారులు పర్యటించి పైసా ఖర్చు లేకుండా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Next Story