- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివాదాలకు కేంద్రంగా మారిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ) వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇంజినీర్లు, సైంటిస్టుల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ) వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇంజినీర్లు, సైంటిస్టుల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ‘సైంటిస్టులకు లాగిన్స్ ఇవ్వాలని నిర్ణయించాం.. దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది.’ అని బోర్డులోని ఓ ఉన్నతాధికారి చెప్పారు. కానీ సైంటిస్టులకు లాగిన్స్ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతున్నదని అంటూనే కాలయాపన చేస్తున్నారు. సైంటిస్టులకు లాగిన్స్ ఇవ్వకుండా ఓ సీనియర్ ఇంజినీర్ అడ్డుపడుతున్నారని ప్రచారం జరుగుతున్నది. ఇంజినీర్లు, సైంటిస్టుల మధ్య గ్యాప్ పెరగడానికి ఆయనే కారణమని పలువురు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. మెంబర్ సెక్రటరీ, చీఫ్ ఇంజినీర్ ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు లేకపోలేదని బోర్డులో చర్చ జరుగుతున్నది.
తీర్మానంలో లేకుంటే?
బోర్డు తీర్మానం నెం.163 (1981), నం.307(1983) ప్రకారం పర్యావరణ పరిశీలనలు నిర్వహించేందుకు ఇంజినీరింగ్, శాస్త్రీయ సిబ్బందికి అధికారం కల్పించారు. అందువల్ల, శాస్త్రీయ సిబ్బంది పరిశ్రమల నుంచి నమూనాలు సేకరించేందుకు నీటి చట్టం సెక్షన్ 21, వాయు చట్టం సెక్షన్ 26 కింద పరిశీలనలు కూడా నిర్వహిస్తున్నారు. నమూనాల సేకరణ కోసం లాగిన్ ప్రమాణాలు అవసరం లేదు. అదే విధానం ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు. సీపీసీబీ పరిశ్రమల పరిశీలన కోసం సూచించిన మార్గదర్శకాల ప్రకారం ఒక ఫీల్డ్ ఆఫీసర్ (ఇంజినీర్), ఒక శాస్త్రీయ సిబ్బంది(సైంటిస్ట్) అవసరం.
ఇది ప్రతి పరిశీలన సమయంలోనూ బోర్డు పాటిస్తోంది.’ అని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారికంగా ప్రకటించింది. అయితే బోర్డు తీర్మానం ప్రకారం లాగిన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు సైంటిస్టులకు సైతం లాగిన్స్ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పడం తీర్మానానికి విరుద్ధమే. అసలు బోర్డు తీర్మానంలో లాగిన్స్ ఇవ్వాలని లేదా? ఉన్నా కూడా దాచిపెడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో బోర్డు ఉన్నతాధికారుల తీరుపై పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు.
ఎంఎస్, సీఈ ఆదేశాలు బేఖాతర్
పీసీబీలో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఓ సీనియర్ ఇంజినీర్ అయితే బోర్డు మెంబర్ సెక్రటరీ, చీఫ్ ఇంజినీర్ ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోవడం లేదు. పైగా తప్పుడు సమాచారంతో ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని పలువురు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.






