జూబ్లీహిల్స్‌లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్

by Kema Shiva Kumar |

జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.

జూబ్లీహిల్స్‌లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ (RV Karnan) మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని అన్నారు. షేక్‌‌పేట్‌లో ఈవీఎం మొరాయించగా.. అక్కడ కూడా పోలింగ్ ప్రారంభమైందని అన్నారు. మొత్తం 6 పోలింగ్ కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని.. వాటిని యుద్ధప్రాతిపదికన తమ టెక్నికల్ టీమ్ సరి చేసిందని అన్నారు. గతంలో కంటే 40 పోలింగ్ కేంద్రాలను పెంచామని ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. అదేవిధంగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) కుటుంబ సమేతంగా షేక్‌పేట్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Next Story