Big Alert: త్వరగా ఇళ్లకు వెళ్లిపోండి.. రెండోరోజూ ఉద్యోగులకు హైదరాబాద్ పోలీసుల అలర్ట్

by Prasad Jukanti |   (  Updated:2025-08-12 07:11:12  IST  )

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Big Alert: త్వరగా ఇళ్లకు వెళ్లిపోండి.. రెండోరోజూ ఉద్యోగులకు హైదరాబాద్ పోలీసుల అలర్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Rains) కురుస్తున్నాయి. కుండపోత వర్షం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను అతలాకుతలం చేస్తోంది. ఇవాళ నగరానికి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నగర ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం (weather alert) చేశారు. ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని, ఉద్యోగులు మధ్యాహ్నం 3 గంటల్లోగా ఇళ్లకు చేరుకునేలా చూసుకోవాలని పోలీసులు సూచన (Hyderabad police alert) చేశారు. సాయంత్రం షిఫ్ట్ ఉన్నవారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఉద్యోగుల భద్రతకు, ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి అత్యవసర సేవలకు సహాయపడుతందని తెలిపారు. కాగా భారీ వర్షాల నేపథ్యంలో నిన్న కూడా ఉద్యోగులు త్వరగా లాగ్ అవుట్ అయి ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించారు.


Also Read..

నేడు, రేపు తెలంగాణలో ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. తస్మాత్ జాగ్రత్త !

Next Story