అర్థరాత్రి బర్త్ డే సెలబ్రేషన్స్.. బుద్ధి చెప్పిన పోలీసులు

by Naga Rani Yarlagadda |

అర్థరాత్రి రోడ్డుపై బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న యువతకు పోలీసులు బుద్ధి చెప్పారు.

అర్థరాత్రి బర్త్ డే సెలబ్రేషన్స్.. బుద్ధి చెప్పిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: అర్థరాత్రి రోడ్డుపై బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న యువతకు పోలీసులు బుద్ధి చెప్పారు. ఇటీవల కాలంలో నగరాల్లో.. ముఖ్యంగా హైదరాబాద్ లో యువత అర్థరాత్రి నడిరోడ్డుపై బర్త్ డే సెలబ్రేషన్స్ పేరుతో ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. తాజాగా ఉప్పల్ ప్రాంతంలో రోడ్డుకు అడ్డంగా బైక్ పెట్టి.. తమ స్నేహితుడి బర్త్ డే సెలబ్రేషన్స్ చేస్తున్న యువతను పోలీసులు అడ్డుకున్నారు. తలపై కిరీటం, మెడలో గజమాల వేసుకుని బాగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారన్న పోలీస్ ఆఫీసర్.. రోడ్డును బ్లాక్ చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. తాము సమీపంలో ఉన్న డీమార్ట్ లో పనిచేస్తామని చెప్పడంతో.. ఇందుకు ఎవ్వరూ అతీతులు కాదని పేర్కొన్నారు.

అర్థరాత్రి రూడ్లపై బర్త్ డే వేడుకలు చేస్కోవడం ఫ్యాషన్ గా మారిపోయిందని క్లాస్ తీసుకున్న ఆయన.. వారందరి పేర్లు, ఇతర వివరాలను నమోదు చేసుకున్నారు. పైగా లైసెన్స్ లేకుండా బైక్ నడపడం చట్టరీత్యా నేరమని, మీకేదైనా అయితే తల్లిదండ్రులు అనాధలవుతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

Next Story