- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాలేజీల్లో BRSV కరపత్రాల పంపిణీ.. అడ్డుకున్న పోలీసులు
బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరిగే నష్టాలను వివరిస్తూ పలు కాలేజీల్లో కరపత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు తెలంగాణ రాష్ట్రం గోదావరి నదిలో 200 టీఎంసీ నీటి వాటాను కోల్పోయే అవకాశం, హైదరాబాద్‌లో తాగునీటి కొరత, రైతులకు సాగునీటి సమస్యలను విద్యార్థులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
అయితే, ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో పాటు ఉపాధ్యక్షుడు తుంగ బాలు, కడారి స్వామి యాదవ్, పడాల సతీష్, కిషోర్ గౌడ్, కోదాటి నాగేందర్ తదితర నాయకులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. బీఆర్ఎస్వీ నాయకులు ఈ అరెస్టులను అప్రజాస్వామిక చర్యగా ఖండించారు, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా 5 రోజుల పాటు కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతామని బీఆర్ఎస్వీ ప్రకటించింది.






