- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: ప్రియుడి కోసం కన్న తల్లితండ్రులనే లేపేసిన కంత్రి నర్సు
ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడి కోసం పథకం ప్రకారం తల్లిదండ్రులను చంపేసింది ఓ నర్సు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రియుడి కోసం కన్నవారిని పొట్టన పెట్టుకున్న ఓ కూతురు దురాగతం బట్టబయలైంది. వికారాబాద్ జిల్లాలో దంపతుల మృతి కేసులో ఊహించని ట్విస్ట్ అందరిని షాక్‍కు గురి చేసింది. నిన్న బట్వారం మండలం యాచారం గ్రామంలో దశరథ్, లక్ష్మి దంపతరులు నిన్న ఒకరి తర్వాత మరొకలు గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. అప్పుల బాధతో దశరథ్ గుండెపోటుకు గురై ప్రాణాలు విడువగ ఆ బాధను తట్టుకోలేక లక్ష్మి సైతం ప్రాణాలు విడిచిందని కుటుంబ సభ్యులు భావించారు. స్థానికంగా తీవ్ర విషాదం నింపిన ఈ ఘటనపై మృతుల కుమారుడు అశోక్ ఇచ్చిన ఫిర్యాదు ఇవ్వగా పోలీసుల ఎంట్రీతో ఊహించని నిజం వెలుగు చూసింది. ఇన్ స్టాగ్రామ్ ప్రియుడి కోసం సొంత కూతురే తల్లిదండ్రులను చంపి ఆపై నాటకం ఆడినట్లు వెల్లడైంది.
ఓవర్ డోస్ ఇంజెక్షన్ ఇచ్చి:
దశరథ్, లక్ష్మి దంపతుల కూతురు సురేఖ సంగారెడ్డిలో నర్సుగా పని చేస్తోంది. ఆమె ఓ యువకుడిని ప్రేమిస్తోంది. అయితే తల్లిదండ్రులు మరో వ్యక్తితో పెళ్లి చూపులు ఏర్పాటు చేయడంతో ఈ పెళ్లి చూపుల నుంచి తప్పించుకోవాలనే ఉద్ధేశంతో తాను పని చేస్తున్న ఆసుపత్రి నుంచి తీసుకువచ్చిన మత్తు ఇంజక్షన్లు తీసుకు వచ్చింది. ఒంటి నొప్పులు తగ్గేందుకు డాక్టర్‍ను అడిగి ఇంజెక్షన్సు తీసుకువచ్చానని తొలుత తల్లికి ఆ తర్వాత తండ్రికి ఓవర్ డోస్ ఇంజెక్ట్ చేసింది. ఆ వెంటనే వారు స్పృహకోల్పోయి పడిపోగా భయాందోళనకు గురైన సురేఖ వెంటనే తన అన్న అశోక్ కు ఫోన్ చేసి అమ్మనాన్న పడిపోయారని నాటకానికి తెరలేపింది. ఇంటికి చేరుకున్న అశోక్ హుటాహుటీన తల్లిదండ్రులను ఆసుపత్రికి తరలించకా వారు అప్పటికే చనిపోయారని వైద్యులు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సురేఖ తీరుపై అనుమానం కలుగగా గట్టిగా ప్రశ్నించడంతో అసలు నిజం అంగీకరించింది. తన ప్రేమ వ్యవహారానికి అడ్డుగా ఉండటం వల్లే వారిని చంపినట్లు ఒప్పుకుంది.






