- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడారం జాతరలో స్టెప్పులు వేసిన పోలీసులు.. వీడియో వైరల్
మేడారం జాతర విధుల్లో ఉన్న పోలీసులు సరదాగా స్టెప్పులు వేశారు. మహాజాతరలో డబ్బులతో భక్తులు ఆలయం వద్దకు వెళుతుంటే అక్కడే ఉన్న పోలీసులు వారితో కలిసి పోయారు. కాసేపు సంబురంగా డప్పు చప్పుళ్లకు తగ్గట్టుగా డ్యాన్స్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: మేడారం జాతర విధుల్లో ఉన్న పోలీసులు సరదాగా స్టెప్పులు వేశారు. మహాజాతరలో డబ్బులతో భక్తులు ఆలయం వద్దకు వెళుతుంటే అక్కడే ఉన్న పోలీసులు వారితో కలిసి పోయారు. కాసేపు సంబురంగా డప్పు చప్పుళ్లకు తగ్గట్టుగా డ్యాన్స్ చేశారు. పోలీసులతో పాటు ఇతర శాఖల అధికారులు, మహిళా పోలీసులు సైతం డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఫుల్ జోష్ తో డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సైతం వీడియో చూసి ఫిదా అవుతున్నారు.
దీన్నే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారని కామెంట్ చేస్తున్నారు. ఇక కోట్ల మంది విచ్చేసే గిరిజన జాతరలో పోలీసులు ఎంతో కష్టపడి సెక్యురిటీ కల్పిస్తున్న సంగతి తెలిసిందే. క్యూ లైన్ లో తొక్కిసలాట జరగకుండా చూసుకోవడంతో పాటు జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బిజీ డ్యూటీలో అప్పుడప్పుడూ ఇలా స్టెప్పులు వేయడం వల్ల కష్టాన్ని సైతం మర్చిపోయి మరింత ఉత్సాహంతో విధులు నిర్వహించే అవకాశం ఉంది.






