- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండియన్ స్పెర్మ్ టెక్‌లో ఆకస్మిక తనిఖీలు.. ఫ్రీజ్ చేసిన వీర్యం సీజ్
సికింద్రాబాద్ లోని ఇండియన్ స్పెర్మ్ టెక్ (Indian Sperm Tech)లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ లోని ఇండియన్ స్పెర్మ్ టెక్ (Indian Sperm Tech)లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఇటీవల సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ (Srusti Test Tube Baby Center) చేసిన నిర్వాకం బట్టబయలవ్వడంతో జంట నగరాల్లోని టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు, స్పెర్మ్ క్లినిక్ సెంటర్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇండియన్ స్పెర్మ్ టెక్ లో వైద్యారోగ్యశాఖ తనిఖీలు చేపట్టింది. అక్కడ నిల్వ ఉంచిన వీర్యం శాంపిల్స్ ను సీజ్ చేసింది. సదరు సెంటర్లో అక్రమంగా ఐవీఎఫ్ విధానాలను అనుసరిస్తున్నట్లు గుర్తించింది
ఇండియన్ స్పెర్మ్ టెక్ లో నిల్వ చేసిన వీర్యాన్ని గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు.. పలు ప్రాంతాల్లో ఉన్న ఐవీఎఫ్ కేంద్రాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో సంస్థ యజమాని పంకజ్ తో పాటు మరో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రోువారీ కూలీలు, యాచకులు, పాదచారులకు కమీషన్ ఆశ చూపించి.. వారి నుంచి వీర్యం, అండాలను సేకరించి వాటిని ఇతర ఐవీఎఫ్ సెంటర్లకు తరలిస్తున్నారన్న సమాచారంతో ఆకస్మిక తనిఖీలు చేశారు.






