మాది మీ సంస్కృతి కాదు.. బీఆర్ఎస్ నేతల ఇండ్లలో సోదాలపై మంత్రి పొన్నం రియాక్షన్ ఇదే

by Ramesh Naini |   (  Updated:2025-11-07 07:15:38  IST  )

మాది బీఆర్ఎస్ సంస్కృతి కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

మాది మీ సంస్కృతి కాదు.. బీఆర్ఎస్ నేతల ఇండ్లలో సోదాలపై మంత్రి పొన్నం రియాక్షన్ ఇదే
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాది బీఆర్ఎస్ సంస్కృతి కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లపై పోలీసుల తనిఖీలు విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మాది బీఆర్ఎస్ సంస్కృతి కాదని, వేధింపులు, కక్ష సాధింపు రాజకీయాలకు మేము చాలా దూరం అని అన్నారు. ఎన్నికల కోడ్ లేని దగ్గర రెయిడ్లకు సంబంధించి పోలీసులకు ఎలాంటి సమాచారం ఉందో మరి అని అన్నారు. ఏదైనా చట్టపరంగా జరుగుతోందని చెప్పారు. మీరు తప్పు చేసి కూడా మమ్మల్ని ఏమనొద్దు అనుకుంటే.. ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేస్తాం.. మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం అంటే.. వాళ్లింకా ప్రభుత్వంలో ఉన్నామనుకుంటున్నారని మండిపడ్డారు.

ఓటు చోరీకి పాల్పడే సంస్కృతి మాది కాదు.. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా విశ్వసిస్తుందని, కక్ష సాధింపు చర్యలకు తాము దిగమని రియాక్ట్ అయ్యారు. కాగా, తన ఇంట్లో పోలీసుల సోదాలపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్‌లో జరిగేవి ఉపఎన్నికలు కావన, సీఎం రేవంత్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో పోలీసులు ఇలా బెదిరించడం దుర్మార్గమని అన్నారు. ఈ దౌర్జన్యంపై రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించాలని, తక్షణం సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ ఇంట్లో డబ్బు పెట్టి కేసులు పెట్టాలన్నది పోలీసుల ప్రధాన ఉద్దేశమని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తమ ఇళ్లలోకి సోదాలకు వచ్చారని రవీందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More... కాంగ్రెస్‌కు జనం కర్రుకాల్చి వాత పెట్టడం తథ్యం.. బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం

Next Story