రైలు ప్రయాణికులకు పోలీసు సిబ్బంది మానవతా సహాయం

by Muthe.Rajitha |

మానవతా దృక్పథంతో స్పందించి భారీ వర్షాల్లో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు సహాయం చేస్తున్న మహబూబాద్ జిల్లా పోలీసులను డీజీపీ శివధర్ రెడ్డి అభినందించారు.

రైలు ప్రయాణికులకు పోలీసు సిబ్బంది మానవతా సహాయం
X

దిశ, తెలంగాణ బ్యూరో : మానవతా దృక్పథంతో స్పందించి భారీ వర్షాల్లో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు సహాయం చేస్తున్న మహబూబాద్ జిల్లా పోలీసులను డీజీపీ శివధర్ రెడ్డి అభినందించారు. ఆపదలో ఆదుకున్న పోలీస్ సిబ్బంది కృషిని ప్రశంసించారు. భారీ వర్షాల కారణంగా డోర్నకల్ లో గోల్కొండ ఎక్స్ ప్రెస్, మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైళ్ళను నిలిపివేయడంతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు పోలీసు సిబ్బంది మానవతా సహాయం అందించారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ స్పందించి సంబంధిత పోలీసు అధికారులను సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైలులోని ప్రయాణికులకు వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు, పులిహోర పొట్లాలు అందజేశారు.

Next Story