కలెక్షన్ సెంటర్స్ కోసం పోలీస్ పైరవీ

by Naga Rani Yarlagadda |

ప్రజలను నేరస్థులను నుంచి కాపాడాల్సిన బాధ్యత కలిగిఉన్న పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది లంచాలకు అలవాటు పడి పక్కదారి పడుతున్నారు. ఫలితంగా ఏసీబీ అధికారుల నిఘాకు చిక్కుతూ సస్పెండ్ అవుతున్నారు.

కలెక్షన్ సెంటర్స్ కోసం పోలీస్ పైరవీ
X
  • ఏసీబీకి పట్టుబడ్డ వారి స్థానంలో పోస్టింగ్ కోసం పైరవీలు
  • ఏసీబీకి చిక్కుతున్న నాలుగో సింహం
  • నాలుగు నెలల్లో 14మంది అధికారులు, సిబ్బంది అరెస్ట్
  • గత నెలలో నలుగురు అధికారుల పై కేసు నమోదు
  • తాజాగా రూ.25 లక్షలు డిమాండ్ చేసి ఏసీబీకి పట్టుబడ్డ డిఎస్పీ

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలను నేరస్థులను నుంచి కాపాడాల్సిన బాధ్యత కలిగిఉన్న పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది లంచాలకు అలవాటు పడి పక్కదారి పడుతున్నారు. ఫలితంగా ఏసీబీ అధికారుల నిఘాకు చిక్కుతూ సస్పెండ్ అవుతున్నారు. ప్రజలకు రక్షణ కల్పించే నాలుగో సింహం లంచాల అత్యాశలో ఏసీబీ ఉచ్చులో పడుతుంది. అధికారు సస్పెండ్ విషయం ఒకలా ఉంటే ఆ స్థానాలతో పోస్టింగ్ కోసం కొందరు అధికారులు పోటీ పడుతున్న తీరు విస్మయానికి గురి చేస్తుంది. పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయం చుట్టూ తిరుగుతూ, స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు లేఖలతో పైరవీలు చేస్తున్నారు. ఏసీబీకి పట్టుబడ్డ ప్రాంతాలను కలెక్షన్ సెంటర్లుగా బావిస్తున్నారు. కలెక్షన్ సెంటర్లను చేజిక్కించుకోవడం ప్రధాన లక్ష్యంగా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఏసీబీకి పట్టుబడ్డ వారి స్థానంలో పోస్టింగ్ కోసం పైరవీలు

గత నాలుగు నెలల కాలంలో ఏసీబీకి పట్టుబడ్డ వారిలో 9మంది ఎస్ ఐ, సీఐ, ఒక డిఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు. వీరుపట్టుబడిన స్థానాలను రెవెన్యూ స్థానాలుగా గుర్తించిన కొంత మంది పోలీసు అధికారులు తమకు ఆ ప్రాంతంలో పొస్టింగ్ కావాలని పైరవీలు మొదలు పెట్టారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఉన్న చోట పోస్టింగ్ కోసం లక్షలు కురిపిస్తామని ఉన్నతాధికారులకు పైరవీలు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉన్న పోస్టింగ్ల కోసం ఇప్పటికే కొంత మంది అధికారులు జిల్లాకు చెందిన రెవెన్యూ మంత్రి చుట్టు పడిగాపులు కాస్తున్నారు. సుమారు 18 మంది అధికారులు రెండు ప్రాంతాలలో పోస్టింగ్ కోసం ముమ్మర ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తున్నది.

లంచాల మత్తులో అధికారులు

లంచాల మత్తు కొంత మంది పోలీసులు అధికారులకు బాగా ఎక్కినట్లుగా తెలుస్తుంది. బాధితులకు అండగా నిలిచి, వారి సమస్యలు తీర్చే వారే ఇలా చేస్తున్నారు. పోలీస్​స్టేషన్ను ఆశ్రయించే బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి వారిని నుంచి లంచాల వసూలు చేసే పనిలో పడ్డారు. కేసులో నిందితుడిగి చేర్చాలంటే ఇంత, నిందితుడి పేరు లేకుండా చేయాలంటే ఇంతా అని రేట్ ఫిక్స్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారు. పోలీస్ శాఖలో పలువురు సిబ్బంది చేతి వాటం ఆ శాఖ ఉన్నతాధికారులను ఆయోమయంలో పడేస్తోంది. కొంతమంది చేస్తున్న తప్పులకు, ఇతర అధికారులు తలదించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇటీవల కాలంలో తరచూ కొందరు కానిస్టేబుళ్ల నుంచి డీఎస్పీ స్థాయి వరకు లంచాలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కుతున్నారు. తాజాగా ఏసీబీకి పట్టుబడిన సూర్యపేట డీఎస్పీ, సీఐలు ఏకంగా రూ.25లక్షల లంచం అడిగారని, రూ.16 లక్షలకు బేరం కుదిరినట్లుగా ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్లో పేర్కోన్నారు. ఇదే కేసు విచారణ క్రమంలో డిఎస్పీ ఇంట్లో సోదాలు నిర్వహించగా బుల్లెట్లు బయటపడినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

నాలుగు నెలల్లో 14మంది అధికారులు, సిబ్బంది అరెస్ట్

ఏసీబీ అధికారులు చేసిన దాడులలో 2025 సంవత్సరంలో 14 మంది పోలీస్ శాఖకు చెందిన వారు ఉండటం గమనార్హం. హోంగార్డు స్థాయి నుంచి డిఎస్పీ స్థాయి వరకు పట్టుబడ్డారు. 3 వేలు లంచం తీసుకుంటుండగా హోంగార్డు పట్టుబడగా, రూ.25లక్షల లంచం డిమాండ్ చేసి డిఎస్పీ పట్టుబడ్డారు. రెండు లక్షలు లంచం తీసుకుంటుండగా సీఐ పట్టుబడ్డారు. భూ వివాదంలో జోక్యం చేసుకుని నాలుగు లక్షలకు లంచం మాట్లాడుకుని మూడు లక్షలు ముందుగానే తీసుకుని మరో లక్ష మద్యవర్తితో తీసుకుంటూ ఓ సీఐ ఏసీబీకి పట్టుబడ్డారు. ఇలా పట్టుబడ్డ అధికారి లంచాల కక్కుర్తిలో పడి ఉన్నతమైన ఉద్యోగానికి మకిలి పట్టిస్తున్నారు. కేవలం ఏప్రిల్ నెలలో నలుగురు అధికారులు పట్టుబడ్డారు.

బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు

కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీసు స్టేషన్‌లో బుధవారం ఏసీబీ అధికారులు సుమారు పది గంటల పాటు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మంజీర పరీవాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తూ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ అధికారులు తనిఖీలు చెపట్టినట్లు చెబుతున్నారు. పట్టుకున్న పదిఇసుక ట్రాక్టర్లను వదిలివేయడానికి డబ్బులు డిమాండ్‌ చేసినట్లు, విచారణలో వెల్లడైనటకలే ఏసీబీ అధికారులు మీడియా సమావేశంలో వెల్లడించారు. రెగ్యులర్‌గా ఇసుక తరలిస్తున్న వారి నుంచి వసూళ్లతోపాటు, అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించినట్లు వివరించారు. సోదాల్లో పలు ఆధారాలు లభించినట్లు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు.

Next Story