Viral Dance: డీజే పాటలకు అదిరిపోయే స్టెప్పులేసిన పోలీసన్నలు.. శోభాయాత్రలో సందడి

by Ramesh Naini |   (  Updated:2025-09-10 06:20:17  IST  )

హైదరాబాద్ వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.

Viral Dance: డీజే పాటలకు అదిరిపోయే స్టెప్పులేసిన పోలీసన్నలు.. శోభాయాత్రలో సందడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు (Ganesh immersion) ప్రశాంతంగా జరుగుతున్నాయి. డీజేలు, బ్యాండ్, కోలాటం, డప్పు చప్పులు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ట్యాంక్‌బండ్‌వైపు గణనాథులు, భక్తులు తరలివస్తున్నారు. గణేశ్ నిమజ్జన ఊరేగింపులో పిల్లలు, యువత, భక్తులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. డీజే పాటలకు పోలీసన్నలు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఖైరతాబాద్ మహాగణపతి (Ganesh Shobha Yatra) శోభాయాత్రలో పోలీసు అధికారులు డాన్స్ చేసి సందడి చేశారు. ఓ పోలీస్ అధికారి ‘పెద్దపులి’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసి అందరిలో ఉత్సాహం నింపారు. నగరంలో పలు చోట్ల శోభ యాత్రలో పోలీస్ అధికారులు భక్తులతో పాటు డ్యాన్స్ స్టెప్పులేసి అందరిలో జోష్ తీసుకొచ్చారు. నిమజ్జన కార్యక్రమాల్లో ఒకవైపు బాధ్యతగా విధులు నిర్వర్తిస్తూనే, డాన్స్ చేసి పోలీస్ అధికారులు ఉత్తేజపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 4 వద్ద 69 అడుగుల ఖైరతాబాద్ మహా గణపతిని నిమజ్జనం చేశారు. మరోవైపు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం అయ్యేందుకు వేలాది వినాయకులు క్యూ కట్టాయి. దీంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు జనంతో కిక్కిరిసి పోయాయి.

CLICK FOR TWEET

Next Story