- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో హద్దు మీరిన అభిమానం.. పొట్టు పొట్టు కొట్టిన పోలీసులు
ఐపీఎల్ ఫైనల్స్‌లో గుజరాత్ ను ఓడించి ఆర్సీబీ విజయం సాధించింది. దీంతో దేశంలోని పలు నగరాల్లో అభిమానులు సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోనూ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ లో మునిగితేలారు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ ఫైనల్స్‌లో గుజరాత్ ను ఓడించి ఆర్సీబీ విజయం సాధించింది. దీంతో దేశంలోని పలు నగరాల్లో అభిమానులు సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోనూ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ లో మునిగితేలారు. అయితే అభిమానుల సంబురాలు కాస్తా హద్దు మీరాయి. సచివాలయం వద్దకు భారీగా వచ్చిన అభిమానులు బారీకేడ్లను కింద పడేస్తూ బీభత్సం సృష్టించారు. అరుపులు, కేకలతో హంగామా చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
అల్లరి చేస్తున్న అభిమానులను పోలీసులు తమ లాఠీలతో అక్కడ నుండి పరుగులు పెట్టించారు. దీంతో కొద్దిసేపటివరకు అక్కడ భయానక ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో అభిమానులు వెంటనే అక్కడ నుండి పరుగులు తీశారు. కర్నూల్ లోనూ ఇలాంటి పరిస్థితే కనిపించింది. కర్నూల్ లో రోడ్డుపైకి వచ్చిన అభిమానులు ఏకంగా బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. రోడ్లపై మంటలు పెడుతూ డ్యాన్సులు చేస్తూ హంగామా సృష్టించారు. దీంతో అక్కడ కూడా పోలీసులు యువకులపై లాఠీ ఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.






