కాళ్లకు సంకెళ్లు వేసి వెట్టి చాకిరీ! నిజామాబాద్ జిల్లా స్టేషన్‌లో ఘటన

by Ramesh Naini |

కాళ్లకు సంకెళ్లు వేసిన వ్యక్తితో పోలీస్ స్టేషన్‌లో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

కాళ్లకు సంకెళ్లు వేసి వెట్టి చాకిరీ! నిజామాబాద్ జిల్లా స్టేషన్‌లో ఘటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాళ్లకు సంకెళ్లు (chains) వేసిన వ్యక్తితో పోలీస్ స్టేషన్‌లో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. నిజామాబాద్ (Nizamabad) జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కేసు విషయంలో పోలీస్ స్టేషన్‌లో ఉన్న వ్యక్తికి.. కాళ్ళకి పెద్ద చైన్‌తో సంకెళ్లు వేసి స్టేషన్లో చీపురుతో పొలీస్టేషన్ క్లిన్ చేయించుకుంటున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఏదైనా నేరం చేసిన వారిని అరెస్ట్ చేసి స్టేషన్ సెల్‌లో వేయడం చేస్తారు. అనంతరం కోర్టులో హాజరు పరిచి రిమాండ్ తరలించడం జరుగుతుంది. చేసిన నేరాన్ని భట్టి అతనికి కోర్డులు శిక్ష విధిస్తాయి. కానీ చిన్న చిన్న కేసుల్లో అరెస్ట్ అయిన వారిని పలు పోలీస్ స్టేషన్ లోనే ఉంచుకుని వారితో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని తరుచుగా ఆరోపణలు వస్తున్నాయి.

Next Story