HYD: మానవత్వం చాటిన పోలీస్.. భారీ వర్షంలో వాహనదారుడికి హెల్ప్

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-25 15:18:40  IST  )

హైదరాబాద్ వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా వర్షాలు(Heavy Rain) దంచికొడుతున్నాయి.

HYD: మానవత్వం చాటిన పోలీస్.. భారీ వర్షంలో వాహనదారుడికి హెల్ప్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా వర్షాలు(Heavy Rain) దంచికొడుతున్నాయి. దీంతో రోడ్లపైకి భారీగా వరదనీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో జీహెచ్ఎంసీ, పోలీసులు, ఎస్‌డీఆర్ఎఫ్, హైడ్రా అధికారులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అదే సమయంలో రోడ్లపై నీళ్లు నిలవకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రజలు ఇబ్బందులకు గురవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏవైనా సమస్యలుంటే.. జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ నెంబర్లకు ఫోన్ చేయాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. తాజాగా భారీ వర్షంలో ఓ వాహనదారుడి వెహికిల్ సికింద్రబాద్ ప్రాంతంలో పంక్చర్ అయింది. భారీ వర్షంలో ఏం చేయలేక ఇబ్బందులు పడుతున్న సదరు వాహనదారుడికి స్థానికంగా ఉన్న ఓ పోలీస్(Hyderabad Police) హెల్ప్ చేశారు. టైరు మార్చడంతో పాటు సదరు ప్రయాణికుడు అక్కడి నుంచి సురక్షితంగా వెళ్లే వరకూ సహాయపడి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో సదరు పోలీసును ప్రశంసిస్తున్నారు.

Next Story