- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల గ్రీన్ సిగ్నల్
గులాబీ పార్టీకి భారీ ఊరట లభించింది. వరంగల్ ( Warangal ) గులాబీ పార్టీ ( BRS Party) రజతోత్సవ సభకు ( BRS silver jubilee

దిశ, వెబ్ డెస్క్ : గులాబీ పార్టీకి భారీ ఊరట లభించింది. వరంగల్ ( Warangal ) గులాబీ పార్టీ ( BRS Party) రజతోత్సవ సభకు ( BRS silver jubilee meeting) తాజాగా పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. గులాబీ పార్టీ సభకు ముందు పోలీసులు నిరాకరణ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టును (Telangana High Court ) ఆశ్రయించారు గులాబీ పార్టీ నేతలు. తమ రజతోత్సవ సభకు పోలీసులు పర్మిషన్ ఇవ్వడం లేదని.. దీనిపై చొరవ తీసుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు గులాబీ పార్టీ నేతలు.
అయితే ఈ కేసు కోర్టు పరిధిలోనే ఇంకా ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే... గులాబీ పార్టీ ( BRS Party) సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. దీంతో ఈ నెల 27వ తేదీన వరంగల్ జిల్లా ( Warangal ) ఎల్కతుర్తిలో గులాబీ పార్టీ రజతోత్సవ సభ యధావిధిగా కొనసాగనుంది. అటు పోలీసులు అనుమతి ఇవ్వడంతో కోర్టులో వేసిన కేసును కూడా గులాబీ పార్టీ నేతలు ( BRS Party Leaders) విత్ డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సభ నుంచే.. ప్రజల్లోకి వెళ్ళనున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బయటకు వచ్చిన కేసీఆర్ అప్పటినుంచి ఇప్పటివరకు ఫామ్ హౌస్ లోనే ఎక్కువ శాతం ఉన్నారు. ఇక ఈ సభ ద్వారా బయటికి రాబోతున్నారు. ఈ మేరకు గులాబీ పార్టీ ( BRS Party) రజతోత్సవ సభకు ( BRS silver jubilee meeting) గులాబీ పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.






