Free WiFi:ఫ్రీ వైఫై వాడుతున్నారా.. పోలీసులు కీలక సూచనలు(వీడియో)

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-24 16:16:40  IST  )

చాలా మంది పబ్లిక్ వైఫై ఫ్రీగా దొరుకుతుందని తెగ వాడేస్తుంటారు.

Free WiFi:ఫ్రీ వైఫై వాడుతున్నారా.. పోలీసులు కీలక సూచనలు(వీడియో)
X

దిశ,వెబ్‌డెస్క్: చాలా మంది పబ్లిక్ వైఫై ఫ్రీగా దొరుకుతుందని తెగ వాడేస్తుంటారు. అలా చేస్తే మీ పర్సనల్ డేటా లూటీ అయినట్లే అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చిన్న చిన్న కాఫీ షాపుల నుంచి మాల్స్, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్‌లలో ఫ్రీ వైఫై దొరుకుతుంది. ఈ క్రమంలో ఫ్రీ వైఫై వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం అంటున్నారు.

ఈ క్రమంలో ఉచిత వైఫై(Free WiFi) నెట్‌వర్క్‌లను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచించారు. ఫ్రీ వైఫై హాట్‌స్పాట్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. హ్యాకర్లే ఫ్రీ హాట్‌స్పాట్ ఆన్ చేసి వ్యక్తిగత వివరాలు దోచుకుంటారంటూ తెలంగాణ పోలీస్ శాఖ(Telangana police Department) తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఫ్రీ వైఫై నెట్‌వర్క్ తో ఆన్లైన్ పేమెంట్స్ చేయొద్దని సూచించారు. లేకపోతే మన లాగిన్ వివరాలు, బ్యాంక్ ఖాతా సమాచారం వంటి సున్నితమైన డేటాను కోల్పోతామని వెల్లడించారు.

Next Story