i Bomma Ravi: ఐ బొమ్మ రవి నుంచి మొదటి రోజు కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన అధికారులు

by Ramesh Naini |   (  Updated:2025-11-20 13:36:24  IST  )

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినిమా పైరసీ కేసులో ప్రధాన నిందితుడు, ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే.

i Bomma Ravi: ఐ బొమ్మ రవి నుంచి మొదటి రోజు కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన అధికారులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినిమా పైరసీ కేసులో ప్రధాన నిందితుడు, ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే. గురువారం మొదటి రోజు కస్టడీలో భాగంగా సైబర్ క్రైమ్ పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. హైదరాబాద్ సీసీఎస్ (CCS) పోలీసులు నిందితుడు రవిని ఐదు రోజుల కస్టడీ కోరగా బుధవారం నాంపల్లి న్యాయస్థానం అనుమతించింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న రవి నుంచి మరింత సమాచారం సేకరించేందుకు పోలీసులు వారం రోజులు కస్టడీ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో భాగంగా మొదటి రోజు విచారణలో సీసీఎస్ అధికారులు రవి బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీసినట్లు తెలిసింది. ఐ బొమ్మ వెబ్‌సైట్ నిర్వహణ ద్వారా వచ్చిన ఆదాయం, అలాగే నెట్వర్క్, ఇంటర్నెట్ సోర్స్ పై కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా రవి వాడిన మొబైల్స్ పై వివరాలు సేకరించారు. క్రిప్టో కరెన్సీ, వివిధ రకాల వాలెట్స్ వినియోగంపై విచారించారు. డబ్బు బదిలీలు, సంపాదన, ఖర్చులు లాంటి వివిధ అంశాలపై వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక, ఐ బొమ్మ వెబ్ సైట్ నిర్వహణ, సైట్ రన్ చేసేందుకు ఐపీ అడ్రస్‌లు ఎలా మార్చాడనే వివరాలు తీసుకునే ప్రయత్నం చేశారు. హార్డ్ డిస్క్‌లకు పాస్ వర్డ్ లు ఉండటంతో.. రవి ద్వారా వాటిని ఓపెన్ చేయించి ఎథికల్ హ్యాకర్స్ సహాయంతో అనాలిసిస్ చేస్తున్నారు. నెదర్లాండ్స్ లో రవి హోమ్ సర్వర్ల డేటాపై ప్రశ్నలు అడిగినట్టు సమాచారం.

Next Story