కోరుట్ల చిన్నారి హత్యకేసులో సంచలన విషయాలు.. తల్లిపై ద్వేషంతో దారుణం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-07 03:46:34  IST  )

జగిత్యాల జిల్లా కోరుట్లలో ఐదేళ్ల బాలిక హితిక్ష మర్డర్ మిస్టరీ (Hitiksha Murder Mystery) వీడింది.

కోరుట్ల చిన్నారి హత్యకేసులో సంచలన విషయాలు.. తల్లిపై ద్వేషంతో దారుణం
X

దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల జిల్లా కోరుట్లలో ఐదేళ్ల బాలిక హితిక్ష మర్డర్ మిస్టరీ (Hitiksha Murder Mystery) వీడింది. ఆదర్శనగర్ కాలనీకి చెందిన ఆకుల రాము - నవీన దంపతుల కూతురు హితిక్ష (5) శనివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. అందరూ వెతుకగా పక్కింటి బాత్రూమ్ లో శవమై కనిపించింది. ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. హితిక్ష తల్లిపై ద్వేషంతో ఆమె తోడికోడలు, చిన్నారికి పిన్ని అయిన మమతే చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నవీన పెత్తనం తట్టుకోలేకనే మమత ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మమతను అదుపులోకి తీసుకున్న పోలీసులు కథలాపూర్ పోలీస్ స్టేషన్ (Kathalapur Police Station)లో విచారణ చేస్తున్నారు. చిన్నారి మృతిపై అనుమానం వచ్చిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ పరిశీలించగా.. ఆ సమయంలో చిన్నారి పిన్ని ఇంటికి వచ్చినట్లు గుర్తించారు.

శనివారం ఉదయం స్కూలుకి వెళ్లిన హితిక్ష.. సాయంత్రానికి ఇంటికి వచ్చింది. ఆరుబయట పిల్లలతో ఆడుకుంటుండగా.. నవీన షాపింగ్ కు వెళ్లింది. అదే సమయంగా భావించిన తోటికోడలు.. కత్తి, కట్టర్ ను వాడి హితిక్ష గొంతుపై విచక్షణారహితంగా పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారిని చంపిన తర్వాత మమత ఏమీ తెలియనట్లు అందరితో కలిసి బోరున విలపించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారిని చంపి.. ఆస్కార్ లెవల్ లో యాక్ట్ చేసిందని నెటిజన్లు ఫైరవుతున్నారు.

Next Story