ఫామ్‌హౌజ్‌పై పోలీసు దాడి.. వ్యభిచార ముఠా గుట్టు రట్టు

by Disha Web Desk 2 |
ఫామ్‌హౌజ్‌పై పోలీసు దాడి.. వ్యభిచార ముఠా గుట్టు రట్టు
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఓ ఫామ్‌హౌజ్‌పై పోలీసులు దాడులు జరిపారు. ఈ సందర్భంగా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నడిపిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కొత్తూరు మున్సిపాలిటీలోని ఓ వెంచర్ ఫామ్‌హౌజ్‌లో వ్యభిచారం జరుగుతోందని సోమవారం రాత్రి పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు దాడి జరిపి వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఓ యువతితో పాటు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మూడు కార్లను సీజ్ చేసినట్టు సీఐ బాలరాజు తెలిపారు.

ప్రజా ప్రతినిధి ఉన్నాడా?

కాగా, పోలీసులు దాడి చేసిన సమయంలో ఓ ప్రజా ప్రతినిధి ఫామ్‌హౌజ్‌లో ఉన్నట్లు సమాచారం. అతను తప్పించుకున్నాడా? తప్పించారా? అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు ప్రజా ప్రతినిధినే లక్ష్యంగా చేసుకునే గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సదరు ఫామ్‌హౌజ్‌ మహేశ్వరం ప్రాంతంలోని ఓ గ్రామ సర్పంచ్‌దని సమాచారం.


Next Story

Most Viewed