- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.14కోట్ల సైబర్ మోసం.. సత్తుపల్లికి చెందిన నలుగురి అరెస్ట్
by Naga Rani Yarlagadda |
సైబర్ నేరస్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎంత అవగాహన కల్పించినా..

X
దిశ, వెబ్‌డెస్క్: సైబర్ నేరస్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎంత అవగాహన కల్పించినా.. ఆ ఉచ్చులో పడి మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఓ డాక్టర్ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఏకంగా రూ.14.61 కోట్లను పోగొట్టుకున్నాడు. నకిలీ పెట్టుబడుల పేరుతో జరిగిన మోసాల్లో రాష్ట్ర చరిత్రలోనే ఇంత పెద్దమొత్తంలో డబ్బు పోగొట్టుకోవడం ఇదే తొలిసారి కావడంత పోలీసులు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన బ్రహ్మినాయుడు, పవన్, మణిరామ్, శివకృష్ణను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వీరంతా సైబర్ నేరగాళ్లకు మ్యూల్ బ్యాంక్ అకౌంట్లు సమకూర్చినట్లుగా పోలీసులు గుర్తించారు. అరెస్ట్ చేసిన నిందితుల్ని ఐదురోజులపాటు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లికోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. సోమవారం తీర్పు రానుంది.
Next Story






