- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gandhi Bhavan: గాంధీ భవన్ వద్ద హై టెన్షన్.. ముట్టడికి రాలేదు.. నిరుద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు
2 లక్షల ఉద్యోగాల సాధనకై మంగళవారం చలో గాంధీభవన్ కార్యక్రమానికి నిరుద్యోగులు పిలుపునిచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: 2 లక్షల ఉద్యోగాల సాధనకై మంగళవారం చలో గాంధీభవన్ (Gandhi Bhavan) కార్యక్రమానికి నిరుద్యోగులు పిలుపునిచ్చారు. దీంతో ఇవాళ గాంధీభవన్ వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఉదయం నుంచే భారీగా పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలోనే గాంధీ భవన్‌కి (unemployed protestors) పలువురు నిరుద్యోగులు తరలివచ్చారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే వారిని అడ్డుకొని అరెస్ట్‌లు చేసి స్టేషన్‌లకు తరలించారు. ఈ సందర్భంగా గాంధీభవన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో పడ్డారు. నోటిఫికేషన్‌లు విడుదల చేయాలని గాంధీభవన్‌కు ముట్టడికి రాలేదని, వినతి పత్రం అందజేయడానికి వచ్చామని నిరుద్యోగులు చెబుతున్నారు.
జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈ సందర్భంగా నిరుద్యోగులు డిమాండ్ చేశారు. 20 వేల మెగా డీఎస్సీ, బీపీఓలో ఖాళీగా ఉన్న 6 వేల ఉద్యోగాలు, ఆర్ధికశాఖ అనుమతితో క్లియర్‌గా ఉన్న పవర్ సెక్టర్‌లో 5368, 20 వేల పోలీసు శాఖ ఖాళీలు, పాత నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా గ్రూప్ 1,2,3 ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ హామీలే తాము అడుగుతున్నట్లు ప్రభుత్వంపై మండిపడ్డారు.






