Breaking: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్.. స్పందించిన మాజీ మంత్రి హరీశ్‌రావు

by Ramesh Naini |

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్‌ జిల్లా దిందా గ్రామ పోడు రైతుల అరెస్టులను గురువారం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు.

Breaking: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్.. స్పందించిన మాజీ మంత్రి హరీశ్‌రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్‌ జిల్లా దిందా గ్రామ (Podu farmers) పోడు రైతుల అరెస్టులను గురువారం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar), ఇతర బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను, ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కాగజ్‌నగర్ నుంచ సిర్పూర్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి కౌటాలకు తరలిస్తుండగా పోలీసుల వాహనాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కౌట‌ల వైపు తీసుకెళ్లిన‌ట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని నిరసన తెలుపుతున్న రైతులకు బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపారు.

కాగా,ఆర్ఎస్పీ అరెస్ట్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ రోడ్డెక్కిన రైతన్నలకు మద్దతు తెలపడమే బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్పా? రైతుల చేతులకు బేడీలు వేయడం, అక్రమంగా అరెస్టులు చేయడమే ఇందిరమ్మ రాజ్యమా? అని నిలదీశారు. కౌటాలా పోలీసు స్టేషన్‌లో నిర్బంధించిన ప్రవీణ్ కుమార్ సహా బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Next Story