Medhapatkar: హైదరాబాద్‌‌లో సామాజికవేత్త మేధా పాట్కర్.. భారీగా పోలీసుల మోహరింపు

by Ramesh Naini |

ప్రముఖ సామాజిక వేత్త, 'నర్మదా బచావో ఆందోళన్ ' ఉద్యమకారిణీ మేధా పాట్కర్‌ హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు.

Medhapatkar: హైదరాబాద్‌‌లో సామాజికవేత్త మేధా పాట్కర్.. భారీగా పోలీసుల మోహరింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ సామాజిక వేత్త, 'నర్మదా బచావో ఆందోళన్ ' ఉద్యమకారిణీ (Indian social activist Medha Patkar) మేధా పాట్కర్‌ హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లోని ఓ నివాసానికి మేధా పాట్కర్ వచ్చారు. వెంటనే హైదరాబాద్ పోలీసులు (Hyderabad city police) అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలోనే ఆమె వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. మూసీ సుందరీకరణ (Musi River) ప్రాజెక్టును పరిశీలించేందుకు ఆమె వచ్చారని రాజకీయవర్గాల్లో టాక్ నడుస్తోంది. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పంపించినట్లు సమాచారం. అయితే కేవలం తన స్నేహితులను కలిసేందుకు మాత్రమే వచ్చినట్లుగా ఆమె పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఆమె మాటలను పోలీసులు వినలేదని, ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని మేధా పాట్కర్‌కు పోలీసులు సూచించినట్లు సమాచారం.

కాగా, ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక సదస్సుకు మేధా పాట్కర్ హాజరయ్యారు. పరిశ్రమలకు ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో పర్యావరణానికి హాని కలుగుతోందని, దీంతో నదీజలాలు పొల్యూట్ అవుతాయని ఆమె చెప్పారు. అభివృద్ధి పేరుతో ప్రకృతి వనరుల విధ్వంసానికి పాల్పడవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేశారు. పర్యావరణానికి నష్టం చేసే విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావడంతో ఆదివాసీలు, నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు.

Next Story