- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో వెరీ స్లోగా పోలింగ్.. పర్సంటేజ్ పెంచేందుకు పోలీసుల వినూత్న కార్యక్రమం (వీడియో)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇవాళ ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్ర ఐదు గంటలకు ముగియనుంది. పోలింగ్‌కు ముగియడానికి మరికొన్ని

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇవాళ ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్ర ఐదు గంటలకు ముగియనుంది. పోలింగ్ ముగియడానికి మరికొన్ని నిమిషాల సమయం మాత్రమే ఉన్నప్పటికి రాష్ట్ర రాజధానిలో ఇప్పటి వరకు పోలింగ్ శాతం తక్కువ నమోదైంది. నగర ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో సిటీలో ఓటింగ్ శాతం పెంచేందుకు పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘‘ఓటర్లరా.. ఈ రోజు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ డే. సెలవు వచ్చిందని ఇంట్లోనే ఉండిపోకండి. ఐదేండ్లలో మంచి ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు వేయండి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలను మీ ప్రజాప్రతినిధి ద్వారా పరిష్కరించుకోడానికి మీరు ఓటు వేయాలి’’ అని పోలీసులు నగరంలోని వివిధ బస్తీలు, గల్లీలో మైకుల ద్వారా పబ్లిక్ అనౌన్స్ మెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






