- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కవిత ‘ఏక్ నిరంజన్’.. కొత్త పొలిటికల్ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధం!
బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్నారన్న నెపంతో కల్వకుంట్ల కవితను మంగళవారం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ డెసిషన్ తీసుకున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్నారన్న నెపంతో కల్వకుంట్ల కవితను మంగళవారం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ డెసిషన్ తీసుకున్నారు. దీంతో కవిత బుధవారం పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 20 ఏండ్లుగా ఆమెకు గులాబీ పార్టీతో ఉన్న అనుబంధం నిన్నటితో ముగిసింది. ఇక నుంచి ఆమె ఒంటరిగానే పోరాడబోతున్నారు.
తెగిన 20 ఏళ్ల అనుబంధం
కవిత రాజీనామాతో ఏళ్లుగా గులాబీ పార్టీతో ఆమెకున్న అనుబంధం తెగినట్టు అయ్యింది. 20 ఏళ్ల పాటు ఆమె పార్టీకి అంకితభావంతో పని చేశారు. క్రియాశీల కార్యకర్తగా కొనసాగారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ‘తెలంగాణ జాగృతి’ని ఏర్పాటు చేసి రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. 2014లో నిజామాబాద్ ఎంపీగా ఎన్నికై జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2019లో ఓటమి అనంతరం ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. నిన్నటి వరకు కవిత వెనకాల కేసీఆర్ ఉన్నారు.. ఆమె ఏం చేసినా నడిచింది.. పార్టీకి డ్యామేజ్ చేసేలా ఏం మాట్లాడినా ఎవరూ నోరు మెదపలేదు.. కానీ కవిత ఇప్పుడు నాన్న సపోర్ట్ లేని జస్ట్ పొలిటికల్ లీడర్ మాత్రమే.
కవిత ప్రయాణం ఎటువైపు?
ఇప్పుడు కవితకు ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సవాళ్లు వెంటాడుతున్నాయనే చెప్పాలి. భవిష‌్యత్తులో ఆమె రాజకీయ ప్రయాణం ఎటు వైపు..? కొత్త రాజకీయ పార్టీ ఎప్పుడు పెట్టబోతున్నారు..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆమె నడుపుతోన్న జాగృతి సంస్థనే రాజకీయ పార్టీగా ప్రకటిస్తారా..? అదే జరిగితే పార్టీని నడిపేంత సత్తా కవితకు ఉందా.? వేరు కుంపటి పెడితే ఏ మేరకు సక్సెస్ అవుతారు.? గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయంగా పార్టీని నడిపించగలరా..? బీఆర్ఎస్ సానుభూతిపరులను తన వైపు తిప్పుకుంటారా.? అసలు కవితను నమ్మి ఆమె వెంట నడిచే నాయకులు ఎంత మంది.? ఇలా ఎన్నో సందేహాలు రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయి. అయితే కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసినట్లు సమాచారం. పార్టీలో తనపై జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఎప్పటి నుంచో ఆమె సొంత పార్టీ మీద గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసినట్టు తెలిసింది.
ఫాంహౌజ్ గేట్లు క్లోజ్
ఇప్పటి వరకు కవిత అడపాదడపా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌజ్‌కు వెళ్లి తండ్రి, తల్లిని కలుస్తుండేవారు. ఇటీవల తన చిన్న కొడుకును ఫారిన్ తీసుకెళ్లే ముందు సైతం ఆమె ఫాంహౌజ్ వెళ్లారు. ప్రస్తుతం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇక ఆమె ఫాంహౌజ్‌కు వెళ్లడం అనుమానంగానే కనిపిస్తున్నది. ఆమెపై తండ్రి కేసీఆర్ ఇప్పటికే కోపంతో ఉన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో తల్లిని కలుద్దామన్నా ఆమె ఫాంహౌజ్ వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. మీడియా సమావేశంలోనూ తనను తన తల్లికి సైతం దూరం చేశారంటూ కవిత ఆవేదన వ్యక్తం చేశారు.






