- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిశీలనలో పీఎంఓ ఆఫీస్ డైరెక్టర్ మన్మీత్ కౌర్
ఖైరతాబాద్ ఇందిరా నగర్, బన్సీలాల్ పేట్ లోని జి వై రెడ్డి నగర్ లో నిర్మించిన రెండు పడకల గదుల నిర్మాణాలను పీఎంఓ

‘డబుల్’ఇండ్లు ఎలా ఉన్నాయి?
ఎలా నిర్వహించుకుంటున్నారు
కేంద్రప్రభుత్వ పథకాలు అందుతున్నాయా?
డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిశీలనలో
పీఎంఓ ఆఫీస్ డైరెక్టర్ మన్మీత్ కౌర్
దిశ, తెలంగాణ బ్యూరో: ఖైరతాబాద్ ఇందిరా నగర్, బన్సీలాల్ పేట్ లోని జి వై రెడ్డి నగర్ లో నిర్మించిన రెండు పడకల గదుల నిర్మాణాలను పీఎంఓ ఆఫీస్ డైరెక్టర్ మన్మీత్ కౌర్ బుధవారం పరిశీలించారు. ముందుగా ఇందిరా నగర్ లో రెండు పడకల నిర్మాణాలను పరిశించించి లబ్ధిదారుల ఇంట్లోకి వెలికి స్వయంగా ఆమె మాట్లాడారు. మంజూరుకానప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని లబ్ధిదారులను ఆమె అడిగారు. ఇంతకు ముందు ఇదే స్థలంలో గుడిసెలు వేసుకొని ఒక్క రూమ్ లో ఉండే వారమని లబ్ధిదారులు ఆమె కు వివరించారు. సముదాయంలో ఏవైనా సమస్యలు, నిర్వహణ ఎలా చేసుకుంటున్నారని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి మాట్లాడుతూ... సముదాయంలో నిర్వహణ కోసం నిర్మించినా కమర్షియల్స్ షాపులు కిరాయికి ఇవ్వడం జరుగుతుందని, అట్టి సొమ్ముతో సముదాయం లిఫ్ట్, కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధి ఆమెకు వివరించారు.
అంగన్వాడీ, బస్తీ దవాఖాన, పాఠశాల దగ్గర్లో ఉన్నాయా అంటూ మహిళా లబ్ధిదారులను అడిగారు. అంగన్వాడీ టీచర్ అందిస్తున్న సేవలు వివరించారు. ఇందిరా నగర్ కాలనీ లో దగ్గర లోనే బస్తీ దవాఖానా, అంగన్వాడి, పాఠశాల అన్ని వసతులు ఉన్నాయని లబ్ధిదారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న పథకాలు అర్హులైన వారికి అందించేందుకు మేళాలు ఏర్పాటుకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. పెన్షన్, స్వయం సహాయక సంఘాలు ఆర్థికాభివృద్ధి పొందిన రుణాలు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారని డైరెక్టర్ మహిళలను అడిగి తెలుసుకున్నారు. పెన్షన్, మహిళలకు రుణాలు పొందుతున్నట్లు మహిళలు వివరించారు. అంతకు ముందు హౌసింగ్ అధికారులు ఏర్పాటు చేసిన పోటో చిత్ర ప్రదర్శన రెండు పడకల నిర్మాణ పరిస్థితిని హౌసింగ్ అధికారులు వివరించారు. గతంలో ఇన్ సీటు పరిస్థితి ని వారు వివరించారు. తదనంతరం బన్సీలాల్ పేట్ జీవైరెడ్డి రెండు పడకల గదుల నిర్మాణ సముదాయాన్ని పరిశీలించారు. ఇక్కడ కూడా అవే ప్రశ్నలు డైరెక్టర్ అడిగి లబ్ధిదారుల నుండి వివరాలను తెలుసుకున్నారు. డైరెక్టర్ మన్మీత్ కౌర్ తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ. కర్ణన్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతం, జీహెచ్ఎంసీ, హౌసింగ్ కార్పొరేషన్ సీఈలు నిత్యానంద, చైతన్య కుమార్, ఎస్ఈ వెంకట రెడ్డి, నర్సింగరావు, ఈఈ పీవీ.రవీందర్ , హైదరాబాద్ హౌసింగ్ పీడీ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు న్యూ ఢిల్లీ నుండి వచ్చిన పీఎంఓ డైరెక్టర్ కు రాష్ట్ర పురపాలక పట్టణాభివృది శాఖ సెక్రెటరీ ఇలంబర్తి, కమిషనర్ ఆర్వీ. కర్ణన్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతం ఆమెకు స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చం అందజేశారు.






