MODI: 1.5 లక్షల సహాయం అందించే పథకానికి ప్రధాని మోడీ శ్రీకారం

by Prasad Jukanti |   (  Updated:2026-02-13 13:38:51  IST  )

న్యూఢిల్లీలో పీఎంవో నూతన కార్యాలయం ‘సేవాతీర్థ్’ ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయాలు ప్రకటించారు. రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు ‘పీఎం-రాహత్’ వైద్య సహాయం, లక్‌పతీ దీదీ లక్ష్యాన్ని 6 కోట్ల మహిళలకు విస్తరణ, వ్యవసాయ మౌలిక సదుపాయాలు మరియు స్టార్టప్ రంగాలకు భారీ నిధుల కేటాయింపులు చేపట్టారు.

MODI:  1.5 లక్షల సహాయం అందించే పథకానికి ప్రధాని మోడీ శ్రీకారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: పీఎంవో నూతన కార్యాలయ భవనం సేవాతీర్థ్ ను ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన భవనంలోకి మారిన తర్వాత ప్రధాని మోడీ పలు కీలక పథకాలకు శ్రీకారం చుట్టారు. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించే లక్ష్యంతో పీఎం-రాహత్ పథకాన్ని మోడీ ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం కింద రూ. 1.5 లక్షల నగదు రహిత చికిత్స అందించనున్నారు. అలాగే లక్‍పత్ దీదీ పథకం లక్ష్యాన్ని భారీగా పెంచారు. ఇప్పటి వరకు లక్‍పత్ దీదీ పథకం కింద 3 కోట్లుగా ఉన్న టార్గెట్ ను 2029 నాటికి 6 కోట్ల మంది మహిళలకు విస్తరించేలా టార్గెట్ నిర్దేశిస్తూ పీఎం నిర్ణయం తీసుకున్నారు.

రైతులకు తీపి కబురు:

ఇలాగే వ్యవసాయ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు నిధులను రూ. 2 లక్షల కోట్లకు పెంపు, దేశంలో స్టార్టప్ వ్యవస్థను వేగవంతం చేసేందుకు రూ. 10 వేల కోట్ల నిధులు కేటాయిస్తూ పీఎం సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన మోడీ ప్రతిపక్షాల తీరుపై విరుచుకుపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కొందరు బానిసత్వ చాయలు విడిచిపెట్టలేదని మండిపడ్డారు. ఈ రోజు మనమందరం ఒక కొత్త చరిత్ర సృష్టించబడుతుండటం చూస్తున్నామని ఫిబ్రవరి 13వ తేదీ భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ఒక కొత్త ప్రారంభానికి సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. ఇవాళ మనమందరం విక్షిత భారత్ సాధించాలనే సంకల్పంతో సేవా తీర్థం, కర్తవ్య భవన్‌లోకి ప్రవేశిస్తున్నామని మన లక్ష్యాలను సాధించడానికి మనకు భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు. కాగా ఈ నూతన సముదయాంలో పీఎంఓ‌తో పాటు కీలక మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఉంటాయి.

Next Story