- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీర్జాగూడ ఆర్టీసీ బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి
మీర్జాగూడ ఆర్టీసీ బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మీర్జాగూడ ఆర్టీసీ బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు రూ.50 వేలు పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అందిస్తామన్నారు.
కాగా.. ప్రమాదంలో చాలా వరకూ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు, ముగ్గురు చొప్పున మరణించడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అచేతనంగా పడి ఉన్న తమ వారిని చూసి ఆస్పత్రుల్లో బోరున విలపిస్తున్నారు. తాండూరు వడ్డెరగల్లీకి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మరణించడంతో ఆ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనూష, సాయిప్రియ, నందిని ఈ ప్రమాదంలో మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బస్సు సామర్థ్యం 54 కాగా.. 70 మంది ఉన్నట్లు సమాచారం. టిప్పర్ లారీ ఓవర్ లోడుతో రావడంతో కంట్రోల్ చేయడం డ్రైవర్ కు కష్టంగా మారడం వల్ల ఘోర ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.






