సౌదీ బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి

by Ajay Maddhiboyina |

: సౌదీలో జ‌రిగిన ఘోర బ‌స్సు ప్ర‌మాదంపై ప్ర‌ధాని మోడీ తీవ్ర‌దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. మ‌దీనాలో జ‌రిగిన ప్ర‌మాదంలో భార‌తీయులు మ‌ర‌ణించ‌డం త‌న‌కు చాలా బాధ క‌లిగించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

సౌదీ బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి
X

దిశ‌, వెబ్ డెస్క్: సౌదీలో జ‌రిగిన ఘోర బ‌స్సు ప్ర‌మాదంపై ప్ర‌ధాని మోడీ తీవ్ర‌దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. మ‌దీనాలో జ‌రిగిన ప్ర‌మాదంలో భార‌తీయులు మ‌ర‌ణించ‌డం త‌న‌కు చాలా బాధ క‌లిగించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయ‌ప‌డిన వారంతా త్వ‌ర‌గా కోలుకోవాల‌ని మోడీ ప్రార్థించారు. రియాద్ లోని భార‌త రాయ‌బార కార్యాల‌యం, జెడ్డాలోని కాన్సులేట్ సాధ్య‌మైనంత స‌హాయం అందిస్తున్నాయ‌ని తెలిపారు. భార‌త అధికారులు సౌదీ అరేబియా అధికారుల‌తో స‌న్నిహితంగా ఉన్నార‌ని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే సౌదీ అరేబియాలో అర్ధ‌రాత్రి జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో 45మంది హైద‌రాబాదీలు క‌న్నుమూశారు. మదీనా నుండి ట్రావెల్ బ‌స్సు మ‌క్కా వెళుతుండ‌గా ఈ ప్ర‌మాదం చోటు చేసుకోగా ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో నిద్ర‌లో ఉన్న‌వారంతా స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. ప్ర‌మాదం నుండి కేవ‌లం ఒక్క వ్య‌క్తి మాత్ర‌మే ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. మొత్తం 54 మంది బృందం హైద‌రాబాద్ నుండి మ‌క్కా వెళ్ల‌గా అక్క‌డ నుండి 46మంది ట్రావెల్ బ‌స్సులో వెళితే న‌లుగురు కారులో వెళ్లారు. మ‌రో న‌లుగురు మ‌క్కాలోనే ఉండిపోయారు. ఇక ఇప్ప‌టికే మ‌ర‌ణించిన‌వారి వివ‌రాల‌ను గుర్తించారు.

Next Story