డబ్బులు ఖాతాలోకి వచ్చాయట.. కానీ చేతికి రావాలంటే అదృష్టం కావాలట..!

by Bhanu |

పీఎం కిసాన్ పథకం కింద రైతు ఖాతాలో జమ అయిన నిధులు పోస్ట్ ఆఫీస్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతిలో గల్లంతైన ఉదంతం మంగళవారం

డబ్బులు ఖాతాలోకి వచ్చాయట.. కానీ చేతికి రావాలంటే అదృష్టం కావాలట..!
X

దిశ, మానోపాడు: పీఎం కిసాన్ పథకం కింద రైతు ఖాతాలో జమ అయిన నిధులు పోస్ట్ ఆఫీస్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతిలో గల్లంతైన ఉదంతం మంగళవారం వెలుగులోకి వచ్చింది. మానోపాడు మండలం నారాయణపురానికి చెందిన రైతు శ్రీకాంత్ రెడ్డి కొన్ని సంవత్సరాలుగా తన పీఎం కిసాన్ డబ్బులు పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌లో జమ అవుతున్నాయని తెలిపారు. అయితే వాటిలో కొన్ని తాను పొందలేదని పక్కన పెట్టిన డబ్బులు ఎక్కడికిపోయాయో తెలియక స్థానిక పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న పోస్ట్మాస్టర్ రామ్నాథ్ రెడ్డి వెంటనే వ్యవహారంపై దృష్టిసారించి ఖాతాను పరిశీలించారు. మొత్తం 19సార్లు డబ్బులు జమ అయినప్పటికీ, కేవలం 6సార్లకే బిపిఎం డబ్బులు ఇచ్చినట్టు ఉండటంతో మిగతా సార్లు ఎవరూ తీసుకెళ్లారో అనుమానం కలిగింది. దర్యాప్తులో కేవలం 2సార్లు ఔట్సోర్సింగ్ ఉద్యోగి అక్రమంగా డబ్బులు డ్రా చేసినట్లు తేలింది. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు నివేదించామని, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పోస్టుమాస్టర్ తెలిపారు.


Next Story