- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీల కలకలం.. స్పందించిన బీజేపీ చీఫ్
మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో పలు చోట్ల ప్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. ఈటల నవ్వు బీజేపీలో చేరి చేసిందేంటయ్యా.. అంటూ ఈ ప్లెక్సీలు వెలిశాయి. ఈటల బీజేపీలో చేరి గ్రూపులు కడుతున్నాడంటూ ఆ ప్లెక్సీలలో పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో పలు చోట్ల ప్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. ఈటల నవ్వు బీజేపీలో చేరి చేసిందేంటయ్యా.. అంటూ ఈ ప్లెక్సీలు వెలిశాయి. ఈటల బీజేపీలో చేరి గ్రూపులు కడుతున్నాడంటూ ఆ ప్లెక్సీలలో పేర్కొన్నారు. పార్టీలో గ్రూపులు కట్టి ఇతరులను ఎదగనివ్వకుండా చేస్తున్నారని ఆరోపించారు. కాగా ఈటలపై దుష్ప్రచారాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించారు. ఈటల బండి సంజయ్ కి తనకు మధ్య గొడవలు పెడుతున్నారు అనేదానిలో నిజం లేదని చెప్పారు.
ఇదే అంశంపై తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు సైతం స్పందించారు. తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతోందని ఓర్వలేకనే ఇతర పార్టీలకు చెందిన నేతలు, బయట వ్యక్తులు ఇలాంటి పనులు చేస్తున్నారని చప్పారు. బీజేపీలో ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. తమ పార్టీ నేతల మధ్య చిచ్చు పెట్టాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు ఏర్పాటు చేసినవాళ్లపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు ఐక్యంగా పనిచేస్తున్నారని, అందుకే పార్టీ గ్రాఫ్ పెరిగిందన్నారు.






