- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దయచేసి ‘మన ఊరు-మన బడి’ బిల్లులు చెల్లించండి.. మండలిలో చైర్మన్ గుత్తా షాకింగ్ కామెంట్స్
ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం ‘మన ఊరు-మన బడి’ పథకం కింద రూ.360 కోట్లతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టారని, ప్రస్తుత ప్రభుత్వం వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం ‘మన ఊరు-మన బడి’ పథకం కింద రూ.360 కోట్లతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టారని, ప్రస్తుత ప్రభుత్వం వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. తన సొంత గ్రామంలోనే పాఠశాల పనులు సగంలో ఆగిపోయాయని, చలికాలంలో పిల్లలు ఆరుబయట కూర్చుంటున్నారని కామెంట్ చేశారు. నిధుల విడుదల విషయం గురించి గత ఒక సంవత్సరం నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణాకు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అన్ని రకాల పేమెంట్లు జరుగుతున్నాయని, కానీ ఈ ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ని ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ అని పేరు మార్చి మైనింగ్ సెస్‌కు అటాచ్ చేసిందని అన్నారు. అక్కడక్కడ కొన్ని పేమెంట్లు జరుగుతున్నాయని, అయితే ప్రస్తుతం అవి కూడా ఆగిపోయాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో 30 వేల మంది కూడా చేరలే..
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్లు పెరిగాయని, 2024-25 విద్యా సంవత్సరం ప్రకారం ప్రభుత్వ బడుల్లో 18.5 లక్షల మంది, ప్రైవేటు పాఠశాలల్లో 36 లక్షల మంది చదువుతున్నారని తెలిపారు. కానీ, ఈ సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 3 లక్షల మంది కొత్త విద్యార్థులను చేర్చినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారని, అవన్నీ ఉత్తవేనని సెటైర్లు వేశారు. నిజానికి 30 వేల మంది కూడా కొత్తగా చేరలేదని ఆయన చురకలంటించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ పేమెంట్లను క్లియర్ చేయాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
Read More..
Ponnam: ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. వాటి కొనుగోలుపై 25 శాతం డిస్కౌంట్
TG Assembly: ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు.. కొనసాగుతోన్న ప్రశ్నోత్తరాలు






