శంషాబాద్‌లో షాకింగ్: విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం తలెత్తడంతో కేరళ వెళ్లాల్సిన ఇండిగో (IndiGo) విమానం గాల్లో ఉండగానే అత్యవసరంగా ల్యాండ్ అయింది.

శంషాబాద్‌లో షాకింగ్: విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం తలెత్తడంతో కేరళ వెళ్లాల్సిన ఇండిగో (IndiGo) విమానం గాల్లో ఉండగానే అత్యవసరంగా ల్యాండ్ అయింది. అప్రమత్తమైన పైలట్ చాకచక్యంగా విమానాన్ని తిరిగి రన్‌వేపైకి చేర్చడంతో పెను ముప్పు తప్పినట్లయింది. వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి కేరళ (కన్నూర్) వెళ్లాల్సిన ఇండిగో 6E 7225 విమానం షెడ్యూల్ ప్రకారం గాలిలోకి ఎగిరింది. అయితే టేకాఫ్ అయిన సుమారు కొన్ని నిమిషాలకే విమానంలో సాంకేతిక సమస్య ఉన్నట్లు పైలట్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులకు సమాచారం అందించి, విమానాన్ని తిరిగి వెనక్కి మళ్లించారు.

ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు..

విమానంలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే, శంషాబాద్ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానంలోని ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని విమానాశ్రయ అధికారులు, ఇండిగో యాజమాన్యం ప్రకటించింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇండిగో సంస్థ తెలిపింది. సాంకేతిక లోపానికి గల కారణాలపై ఇంజినీరింగ్ బృందం తనిఖీలు చేస్తోంది.

Next Story