బిగ్ న్యూస్.. జూబ్లీహిల్స్ బై పోల్ అభ్యర్థిగా పీజేఆర్ కుమారుడి నామినేషన్

by Malleboina Mahesh |

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా.. నవంబర్ 11న పోలింగ్ జరగనుంది

బిగ్ న్యూస్.. జూబ్లీహిల్స్ బై పోల్ అభ్యర్థిగా పీజేఆర్ కుమారుడి నామినేషన్
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి (Jubilee Hills Constituency) ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం (Election Commission) నోటిఫికేషన్ విడుదల చేయగా.. నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ తో పాటు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే మూడు పార్టీలో ఉప ఎన్నికల్లో (by-elections) పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించాయి. బీఆర్ఎస్.. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మాగంటి గోపీనాథ్ భార్య సునితకు మరోసారి అవకాశం ఇచ్చింది. అయితే ఇప్పటికే ఆమె మూడు సెట్ల నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే.

ముందస్తు జాగ్రత్త లో భాగంగా అప్రమత్తమైన బీఆర్ఎస్ పార్టీ.. జూబ్లీహిల్స్ బై పోల్ అభ్యర్థిగా పీజేఆర్ కుమారుడు అయిన విష్ణు వర్థన్ రెడ్డి (Vishnu Vardhan Reddy)తో కూడా మరో నామినేషన్ దాఖలు చేయించింది. ఎందుకంటే బీఆర్ఎస్ అభ్యర్థి అయిన మాగంటి సునీత నామినేషన్‌లో ఎమైన తప్పులు ఉండి.. ఆమె నామినెషన్లు తిరస్కరణకు గురైతే.. బీఆర్ఎస్ అల్టర్‌నేట్ అభ్యర్థిగా విష్ణు వర్థన్ పోటీలో నిలిచే అవకావం ఉంటుంది. లేదా ఆమె నామినేషన్ సరిగ్గా ఉంటే.. ఉపసంహరణ తేదీలోపు.. విష్ణు వర్థన్ రెడ్డి తన నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.

Next Story