- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మాగంటి సునీత అసలు నిజం తెలుసుకోవాలి’.. పీజేఆర్ కూతురు విజయారెడ్డి సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్(BRS)పై పీజేఆర్(PJR) కూతురు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి(Vijaya Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS)పై పీజేఆర్(PJR) కూతురు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి(Vijaya Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. మాగంటి సునీత(Maganti Sunitha) ఏడుపుని నమ్ముకుని బీఆర్ఎస్ ఉప ఎన్నికకు వెళ్తోందని విమర్శించారు. సెంటిమెంట్లు పనికిరావన్న వారే ఇప్పుడు సెంటిమెంటు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మాగంటి కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశం బీఆర్ఎస్‌కు ఎంతమాత్రం లేదని అన్నారు. సునీతను బలిపశువును చేసి బీఆర్ఎస్ గెలవాలని చూస్తోందని అన్నారు. ఈ విషయం మాగంటి సునీత ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిదని హితవు పలికారు. రాజకీయ అవసరాల కోసం మాగంటి కుటుంబాన్ని బీఆర్ఎస్ వాడుకుంటోందని అన్నారు. గోపీనాథ్ పేరుతో ఫలితాలు ఎలా ఉంటాయో ఈసారి వాళ్లే చూస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గోపీనాథ్(Gopinath) తన ప్రయోజనాల కోసం ప్రజలను, కార్యకర్తలను ఎంతో ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ కీలక దశకు చేరుకున్నది. నామినేషన్ల విత్ డ్రా ప్రక్రియ ముగిసి 58 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో ఈసీ ఇటీవల ఎన్నికల గుర్తులను సైతం కేటాయించింది. దీంతో అభ్యర్థులంతా ప్రచారపర్వాన్ని పరుగులు పెట్టించే యత్నాల్లో మునిగిపోయారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్, పవర్‌లో ఉండి పరువు నిలుపుకోవాలని కాంగ్రెస్, ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారాన్ని నిజం చేయాలనే ఉద్దేశంతో మూడు పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి.






