- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాలీవుడ్‌లో మళ్లీ పైరసీ కలకలం: పవన్, ప్రభాస్ సినిమాలు లీక్
తెలుగు చలనచిత్ర పరిశ్రమను పైరసీ మహమ్మారి వణికిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చలనచిత్ర పరిశ్రమను పైరసీ మహమ్మారి వణికిస్తోంది. ఇటీవల థియేటర్లలో సందడి చేస్తున్న భారీ చిత్రాలతో పాటు సంక్రాంతికి విడుదలైన హిట్ సినిమాలు కూడా పైరసీ కోరల్లో చిక్కాయి. దీనిపై 'తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్' (TFCC) సీరియస్ అయింది. ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సహా మొత్తం ఐదు చిత్రాలు ఇంటర్నెట్‌లో అక్రమంగా ప్రత్యక్షమయ్యాయి.
వీటిలో...
1. ఉస్తాద్ భగత్ సింగ్ (పవన్ కల్యాణ్)
2. రాజా సాబ్ (ప్రభాస్)
3. మన శంకరవరప్రసాద్ గారు (చిరంజీవి)
4. అనగనగా ఒక రాజు (నవీన్ పొలిశెట్టి)
5. నారీనారీ నడుమ మురారి (శర్వానంద్)
ఈ సినిమాలను కొందరు దుండగులు హెచ్‌డీ క్వాలిటీలో పైరసీ సైట్లలో అప్‌లోడ్ చేశారని, దీనివల్ల నిర్మాతలకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోందని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదును స్వీకరించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. పైరసీకి పాల్పడుతున్న పలు వెబ్‌సైట్లను నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. వాటిలో ప్రధానంగా మూవీరూల్జ్ (Movierulz) వెబ్‌సైట్లు, సినీవుడ్ (Cinewood) వెబ్‌సైట్,, తమిళ్ ఎంవీ (TamilMV) వెబ్‌సైట్ల నిర్వాహకులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అలాగే, పైరసీని ప్రోత్సహించే ఇటువంటి సైట్లను బ్లాక్ చేసేందుకు టెలికాం సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. "పైరసీ చూడటం, ఆ లింకులను సోషల్ మీడియాలో షేర్ చేయడం నేరం. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సినిమాను థియేటర్లలోనే చూసి పరిశ్రమను కాపాడాలి." అని సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరించింది.






