కోర్టు స్టేతో పింక్ లోటస్ మీడియాలు శునకానందం.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ హాట్ కామెంట్స్

by Ramesh Goud |

సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో బీఆర్ఎస్, బీజేపీ సోషల్ మీడియాలు శునకానందం పొందుతున్నాయని, వారు చేసే అబద్దపు ప్రచారాల వల్ల ఎటువంటి నష్టం ఉండదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Congress MLC Addanki Dayakar) అన్నారు.

కోర్టు స్టేతో పింక్ లోటస్ మీడియాలు శునకానందం.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో బీఆర్ఎస్, బీజేపీ సోషల్ మీడియాలు శునకానందం పొందుతున్నాయని, వారు చేసే అబద్దపు ప్రచారాల వల్ల ఎటువంటి నష్టం ఉండదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Congress MLC Addanki Dayakar) అన్నారు. హెచ్‌సీయూ భూముల అంశంపై (HCU Lands Dispute) సుప్రీంకోర్టు (Supreme Court) ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టే ఇచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండటంపై ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసిన అద్దంకి.. బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS)లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్‌సీయూ విషయంలో 400 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించినది అయినా.. సుప్రీంకోర్టు పర్యావరణం కు సంబంధించిన కొన్ని అంశాలలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాత్రమే స్టే ఇచ్చిందని తెలిపారు. దీనిపై పింక్ లోటస్ మీడియా (Pink Lotus Media), బీఆర్ఎస్, బీజేపీలు పండగ చేసుకుంటున్నాయని అన్నారు. ఇలాంటి అబద్దాలు ప్రచారం చేయడం వల్ల వారు శునకానందం పొందడం తప్ప మరేమి ఉండదని చెప్పారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డిపై చేస్తున్న దుష్ప్రచారాలు అన్ని బుమరాంగ్ అవుతాయని అన్నారు. ప్రభుత్వం ఎప్పుడూ తప్పు చేయదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఏ విషయంలోనైనా ఆచితూచి అడుగేస్తారని తెలిపారు.

నాటి సీఎంలు రాజశేఖర్ రెడ్డి (YS Rajashekar Reddy), రోశయ్య (Roshaiah), కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) నుంచి మొదలు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వరకు అందరూ కూడా కోర్టులు, చట్టాలకు లోబడే ప్రైవేటు వ్యక్తుల నుండి 400 ఎకరాలను కాపాడారని, మధ్యలో వచ్చిన బీఆర్ఎస్ ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. దీనిని గమణించకుండా ట్రోల్స్ చేస్తున్న వారి నోట్లో వెలగకాయ పడక తప్పదని అన్నారు. హెచ్ సీయూ భూముల విషయంలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం జరుగుతోందని, ప్రజలు ఎవరూ కూడా ఈ అబద్దపు ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. బీఆర్ఎస్ వల్ల కొందరు లోకల్ మీడియా, బీజేపీ వల్ల జాతీయ మీడియా ప్రభావితులై ఈ ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. ఇక హెచ్‌సీయూ భూముల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న అబద్దపు ప్రచారాలతో వచ్చే నష్టం ఏమీ లేదని, రేవంత్‌ రెడ్డిని అభాసుపాలు చేయాలనుకుంటే ప్రజల ముందు దోషులుగా నిలబడక తప్పదని కాంగ్రెస్ నేత హెచ్చరించారు.

Next Story