తీర్థయాత్రలు మనస్సాక్షిని మేల్కొలుపుతాయి.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-08 04:23:30  IST  )

తీర్థయాత్రలు మనిషిలోని మనస్సాక్షిని మేల్కొలిపేందుకు మార్గమని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అన్నారు.

తీర్థయాత్రలు మనస్సాక్షిని మేల్కొలుపుతాయి.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తీర్థయాత్రలు మనిషిలోని మనస్సాక్షిని మేల్కొలిపేందుకు మార్గమని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అన్నారు. ఇవాళ ఆయన ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని తన సొంత నియోజకవర్గం వారణాసి (Varanasi)లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నాలుగు వందే భారత్‌ రైళ్ల (Vande Bharat Express)ను ప్రధాని ప్రారంభించారు. దీంతో బనారస్‌- ఖజురహో, లఖ్‌నవూ- సహరన్‌పుర్‌, ఫిరోజ్‌పుర్‌- ఢిల్లీ, ఎర్నాకుళం- బెంగళూరు మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు పెట్టునున్నాయి.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల అభివృద్ధిలో మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషించాయని అన్నారు. ఒక నగరానికి మెరుగైన కనెక్టివిటీ వచ్చిన వెంటనే ఆ నగరం అభివృద్ధి బాట పడుతుందని అన్నారు. మౌలిక సదుపాయాలు అంటే కేవలం పెద్ద వంతెనలు, హైవేలు మాత్రమే కాదని అన్నారు. ఇక తీర్థయాత్రలు మనిషిలోని మనస్సాక్షిని మేల్కొలపడానికి మార్గని పేర్కొన్నారు. ఇవాళ ప్రారంభించి వందే భారత్ రైళ్లు (Vande Bharath Trains) కేవలం పుణ్యక్షేత్రాలను మాత్రమే కలిపేవి కాదని.. అభివృద్ధిని కూడా వేగవంతం చేస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేవారు. గత 11 సంవత్సరాల్లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అభివృద్ధి పనులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఎంతగానో బలోపేతం చేశాయని అన్నారు. గతేడాది 11 కోట్ల మంది భక్తులు బాబా విశ్వనాథ్ దర్శనం చేసుకున్నారని, 6 కోట్ల కంటే ఎక్కువ మంది రామ్‌లల్లా దర్శనం చేసుకున్నారని తెలిపారు. వారి రాకతో రాష్ట్ర ఖజానాలోకి రూ.వేల కోట్లు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

Next Story