High Court : కార్మికుల వేతనాలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు

by Muthe.Rajitha |   (  Updated:2025-03-07 16:47:32  IST  )

కార్మికుల వేతనాల(Workers Wages)పై హైకోర్టు(High Court)లో ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL) దాఖలైంది.

High Court : కార్మికుల వేతనాలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్ : కార్మికుల వేతనాల(Workers Wages)పై హైకోర్టు(High Court)లో ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL) దాఖలైంది. రాష్ట్రంలోని దాదాపు 73 విభాగాలలో కోటి27లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారని తెలిపారు. 5 విభాగాలలోని సంఘటిత కార్మికులు 47 లక్షల మంది ఉన్నారని కోర్టుకు వివరించారు. గత విచారణలో 6 వారాలలో గెజిట్ అమలు చేయాలని ఆదేశించినట్లు వివరించారు. నేటికి ప్రభుత్వం గెజిట్ అమలు చేయలేదని తెలిపారు. వాదనలు పరిశీలించిన ధర్మాసనం 4 వారాలలోగా కార్మికుల పెరిగిన వేతనాలు అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన జీవోను గెజిట్ పబ్లిష్ చేయాలని, లేనిపక్షంలో సంబంధిత అథారిటీ హైకోర్టులో హజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఎప్రిల్ 11కి వాయిదా వేసింది.

Next Story