- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pension: పించన్ కోసం దివ్యాంగుడి కన్నీరు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
పించన్ కోసం దివ్యాంగుడి కన్నీరు పెట్టిన తీరు అందరిని కలచివేస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆసరా పించన్ (Asara Pension) కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని ఓ దివ్యాంగుడు రోధిస్తున్న తీరు అందరిని కలిచివేస్తోంది. నల్గొండ జిల్లా చింతపలపల్లి మండలం వింజమూరు గ్రామానికి చెందిన పోలే రవి కుమార్ (34) చిన్నతనం నుంచే నడవడంలో ఇబ్బంది పడుతున్నాడు. అయితే గతంలో తనకు రూ. 500 పెన్షన్ వచ్చేదని బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తనకు వచ్చే పెన్షన్ రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాను ప్రభుత్వ హస్టల్ లో చదువుకుంటున్నానని తనకు ఆసరా పెన్షన్ ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చొరవ తీసుకుని తనకు పెన్షన్ వచ్చేలా చూడాలంటూ కన్నీరు పెడుతూ ఇటీవల సోషల్ మీడియాలో రవి కుమార్ పెట్టిన వీడియో వైరల్ గా మారింది. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని దయచేసి పెన్షన్ వచ్చేలా చూడాలని కోరుతున్నాడు. కాగా తెలంగాణ ప్రభుత్వం వృద్ధులు, వితంతు, వికలాంగులు, ఒంటరి మహిళల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆసరా పించన్లు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.






