- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Flash News : కేఏ పాల్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడైన కేఏ పాల్ (KA Paul)పై లైంగిక వేధింపుల కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడైన కేఏ పాల్ (KA Paul)పై లైంగిక వేధింపుల కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కేఏ పాల్ తనను లైంగికంగా వేధించినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు సమాచారం. యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కాగా.. పోలీసులకు కేఏ పాల్ పై ఫిర్యాదు చేసిన యువతి ఆయన వద్ద పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
దీనిపై కేఏ పాల్ టీమ్ స్పందించింది. జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో ప్రత్యర్థులు చేసిన కుట్ర ఇది అని ఆరోపించింది. ఇలాంటి సిల్లీ పనులు చేసి పాల్ ను ఆపలేరని, ఆయన పరువుకు భంగం కలిగేలా వ్యవహరించిన వారిపై పరువునష్టం దావా వేస్తామని పేర్కొంది.
Next Story






