సెల్‌ఫోన్ మాయాలో మానవత్వం మరిచారా? చంటి పాపతో కూర్చున్న మహిళ ఫోటో వైరల్

by Ramesh Naini |

సెల్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఒంటి మీద ఉన్న బట్టలు ఎత్తుకెళ్లిన సోయి లేకుండా కొందరు ఉంటున్నారు.

సెల్‌ఫోన్ మాయాలో మానవత్వం మరిచారా? చంటి పాపతో కూర్చున్న మహిళ ఫోటో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మొబైల్ అడిక్షన్ (Mobile addiction) అనేది నేటి సమాజంలో బాగా పెరిగింది. సెల్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఒంటి మీద ఉన్న బట్టలు ఎత్తుకెళ్లిన సోయి లేకుండా కొందరు ఉంటున్నారు. ముఖ్యంగా నేటి యువత సెల్‌ఫోన్ మాయాలో పడిపోయారని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో, బయట ఎక్కడ ఉన్న సెల్‌ఫోన్‌లోనే తన ప్రపంచం అనుకునేలా కొందరూ బతికేస్తున్నారు. కొంతమంది డ్రైవింగ్ చేసే సమయంలో ఫోన్ పరధ్యానంలో పడి ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. నేడు మానవ సంబంధాల కంటే నెట్టింట ఉండే ఫాలోవర్స్, లైక్స్, వ్యూస్‌కే కొందరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఏదైనా చిన్న గొడవ జరిగిన, ప్రమాదం జరిగిన మొదటగా అంబులెన్స్‌కు కాల్ చేయడం కంటే ఆ ప్రమాద సన్నివేశాన్ని వీడియోలు, ఫోటోలు తీయడం చాలా మంది చేస్తున్నారు. ప్రమాద భాదితులకు సహాయం చేద్దాం అనే ఆలోచన వదిలేసి కొంత మంది ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ వీడియోలు చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి.

సెల్‌ఫోన్ మాయాలో నేటి యువత మానవత్వం మరిచారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మొబైల్ ఫోన్లు చూస్తూ ముగ్గురు యువతులు ప్రవర్తించిన తీరు తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. (metro train) మెట్రో ట్రైన్‌లో ఓ చంటి పాపను ఓడిలో పెట్టుకోని మహిళ కూర్చీల పక్కన కింద కూర్చోని ఉంది. ఆమె పక్కనే ముగ్గురు యువతులు మెట్రో సీట్లో తమ మొబైల్ చూసుకుంటూ దర్జాగా కూర్చున్నారు. చంటి పాపతో కింద కూర్చున్న మహిళకు యువతుల్లో ఒకరు కనీసం సీటు ఇచ్చి ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ముగ్గురిలో ఎవరో ఒకరు ఆమెకు తమ సీటు ఇచ్చి ఉంటే ఏమవుతుందని నెటిజన్లు వారిపై మండిపడ్డారు. కాగా, ఈ ఫోటో గతంలో కరోనా సమయం అప్పటిదిగా తెలుస్తోంది. ప్రస్తుతం మాత్రం ఎక్స్‌లో ఈ ఫోటో వైరల్ అవుతోంది.

Next Story