- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగు చూస్తోన్న నిజాలు.. ఇద్దరు కీలక నేతల పేర్లు వెల్లడి
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో దిమ్మతిరిగే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అప్పటి ప్రభుత్వంలో ఉన్నత స్థాయి వ్యక్తుల ఆదేశాల మేరకు మాజీ ఎస్ఐబీ చీఫ్‌కు ఫోన్ ట్యాపింగ్ చేయాలంటూ ఆదేశాలు అందాయని తెలుస్తోంది. అందుకు అనుగుణంగా డీఎస్పీ ప్రణీత్ రావు టార్గెట్ పెట్టుకున్న వ్యక్తుల ఫోన్ల ట్యాపింగ్ చేసినట్లుగా ఒప్పుకున్నాడు. ముఖ్యంగా ఎన్నికల ముందు విపరీతంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కాగా, హైదరాబాద్ చీఫ్‌గా సందీప్ శాండిల్య రావడంతో నిందితులు సైబరాబాద్‌కు తమ మకాం మార్చినట్లుగా విచారణలో తేలింది. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి మరో ఇద్దరు కీలక నేతల పేర్లను ప్రణీత్ రావు పోలీసులకు తెలిపారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎవరా.. ఇద్దరు నేతలు అనేది హాట్ టాపిక్‌గా మారింది.