Bandi Sanjay : ఫోన్ ట్యాపింగ్ కేసు.. బండి సంజయ్ కి సిట్ పిలుపు

by Muthe.Rajitha |

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) అధికారులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు.

Bandi Sanjay : ఫోన్ ట్యాపింగ్ కేసు.. బండి సంజయ్ కి సిట్ పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) అధికారులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో గత BRS ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సిట్ ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, అధికారుల నుంచి వాంగ్మూలాలు సేకరించింది. ఈ కేసులో తాజాగా, కేంద్రమంత్రి, బండి సంజయ్ కుమార్‌(Bandi Sanjay Kumar)ను సిట్ అధికారులు ఫోన్‌లో సంప్రదించినట్లు సమాచారం.

బండి సంజయ్ ఫోన్, ఆయన సన్నిహితుల ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ దర్యాప్తులో తేలిన నేపథ్యంలో, ఆయన వాంగ్మూలం నమోదు చేసుకోవడానికి సిట్ కార్యాలయానికి రావాలని అధికారులు సూచించారు. దీనికి సంజయ్ సానుకూలంగా స్పందిస్తూ, ఈ నెల 23వ తేదీ వరకు తాను అందుబాటులో ఉంటానని, ఈ లోపు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని తెలిపినట్లు తెలుస్తోంది.

Next Story