ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఎమ్మెల్సీ కవిత పీఏకు సిట్ నోటీసులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-28 04:51:06  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో తవ్విన కొద్దీ సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఎమ్మెల్సీ కవిత పీఏకు సిట్ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో తవ్విన కొద్దీ సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు సిట్ (SIT) అధికారులు కూడా విచారణనను మరింత వేగవంతం చేశారు. ఇప్పటి వరకు లభ్యమైన సమాచారం మేరకు మొత్తం 618 మంది ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని వారు నిర్ధారించారు. అందులో 228 మందికి నోటీసులు ఇచ్చి కేసులో వారి వాంగ్మూలం తీసుకున్నారు. ఇటీవల సిట్ విచారణకు హాజరైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) డీఎస్పీ ప్రణీత్ రావు (Praneeth Rao) ఫోన్‌లో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పీఏకు సంబంధించిన పలు ఆడియో రికార్డింగ్స్ బయటపడ్డాయి. దీంతో సిట్ అధికారులు ఎమ్మెల్సీ వ్యక్తిగత సహాయకుడి (పీఏ)ను విచారణకు రావాలంటూ ఇవాళ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా పలువురు బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలువురు వీఐపీల వాంగ్మూలాలను అధికారులు రికార్డ్ చేసిన విషయం తెలిసిందే.

Next Story